మహా శివరాత్రి నుంచి కుబేరులవుతున్న రాశులు వీరే
మహాశివరాత్రి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆరోజు లయ కారకుడైన పరమేశ్వరుడికి.. పార్వతీదేవితో కల్యాణం జరుగుతుంది. అదేరోజు రాత్రి 12.00 గంటలకు లింగోద్భవం జరుగుతుంది. ఆరోజు ఆ భక్త సులభుడిని పూజిస్తే కోరికలన్నీ సులభంగా నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి వచ్చింది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో 14వ రోజు మహా శివరాత్రి వస్తుంది. అంత గొప్ప పండగ రోజు అద్భుతమైన అమృతసిద్ధి యోగం ఏర్పడుతోంది. ఈ యోగంవల్ల కొన్ని రాశుల జీవితం ఊహించనిరీతిలో మారిపోనుంది. ఆర్థికంగా అన్నిరకాలుగా కలిసివస్తుంది.
మేష రాశి
ఆర్థికంగా వీరి పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఏ పనిచేయాలనుకున్నా వారికి అదృష్టం తోడుండి సులువుగా పూర్తిచేసి విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. ఊహించనిరీతిలో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. రుణ సమస్యలన్నీ తీరిపోయి మనశ్శాంతిగా జీవితం గడుపుతారు. శివరాత్రిరోజు ఎట్టి పరిస్థితుల్లోను వీరు శివాలయాన్ని సందర్శించి పరమేశ్వరుడిని పూజించుకోవాలి.

మిథున రాశి
ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం అద్భుతమైన లాభాలున్నాయి. ఈ సమయంలో ఈ రాశివారు ఏ పని తలపెట్టినా లాభాలను భారీగా అందుకుంటారు. అంతేకాదు.. ఆర్థికంగా అనేకవిధాలుగా కలిసిరానుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో ఉన్నవారు వైవాహిక జీవితంలో ఉన్న మాధుర్యాన్ని చవిచూస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో చాలా సులువుగా విజయం సాధించి ఆర్థిక లాభాలను అందుకుంటారు.
సింహరాశి
ఉద్యోగాలు చేస్తున్నవారికి పెద్దమొత్తంలో వేతనాలు పెరుగుతాయి. అంతేకాదు.. ఊహించనిరీతిలో ప్రమోషన్స్ ఉంటాయి. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేయడంతోపాటు ఆస్తులను కొనుగోలు చేస్తారు. దాంపత్య జీవితంలో ఈ రాశివారికి కొన్నిరోజులుగా మనస్పర్థలు వస్తున్నాయి. అవన్నీ తొలగిపోతాయి. అరుదైన సంఘటనలు జరిగి వీరికి అన్నీ లాభసాటిగా మారతాయి. ఆస్తులు విపరీతంగా పెరుగుతాయి. ఏ పని తలపెట్టినా చాలా సులువుగా విజయాలను సాధిస్తారు.












Click it and Unblock the Notifications