ఏప్రిల్‌లో ఈ రాశులకు కుజ మహర్దశ పట్టుకుంది... అద్భుత ధనయోగం
నవగ్రహాల్లో కీలకమైన కుజుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కుజుడు దేవతలకు సైన్యాధిపతి. గ్రహాలు రాశి సంచారం చేసే సమయంలో రాశి చక్ర గుర్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయనే విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరులో కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఈ ఏడాది మిథునరాశిలో సంచారం చేస్తున్నాడు. తిరిగి ఏప్రిల్ మూడోతేదీన కర్కాటక రాశిలోకే సంచారం చేయబోతున్నాడు. కుజుడు ఇలా సంచారం చేయడంవల్ల మూడు రాశులకు బాగా కలిసిరానుంది. ఆర్థికంగా అనేక లాభాలుంటాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
మేష రాశి
వీరికి సంతోషం రెట్టింపు అవడంతోపాటు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉంటారు. ఏప్రిల్ నెల వీరికి బాగా కలిసివస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడంతోపాటు కారును కొంటారు. వీరి ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోతుంది.

తులారాశి
ఈ రాశివారికి వ్యాపారాల పరంగా బాగా కలిసివస్తుంది. చేసే ప్రతి పనిలోను అదృష్టం కలిసివచ్చు విజయవంతంగా పూర్తవుతుంది. జీవితంలో సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితం ప్రేమానురాగాలతో సాగుతుంది. గతంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థికంగా విజయాన్ని అందుకుంటారు. అయితే ఈ సమయంలోనే డబ్బు విజయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.
కన్యారాశి
వీరికి మంచిరోజులు వచ్చాయని చెప్పొచ్చు. సన్నిహితుల నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మంచి సంపదను పొంది ధనవంతులవుతారు. అదనపు ఆదాయానికి మార్గాలు కూడా దొరుకుతాయి. సమాజంలో మంచి హోదా వస్తుంది. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన ప్రేమను పొందుతారు. వ్యాపారస్తులకు ఊహించనిరీతిలో లాభాలున్నాయి. పోటీపరీక్షల్లో విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు.












Click it and Unblock the Notifications