కొద్దిరోజులు ఓపిక పడితే ఈ రాశులకు మహర్ధశ పట్టుకుంటుంది

ఖగోళంలో గ్రహాల కదలికలు మానవుల వ్యక్తిగత జీవితాలను, సమాజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. నవగ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు గ్రహాలకు సేనాధిపతి. బలం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి లక్షణాలకు కారకుడు. ప్రతి 45 రోజులకు ఒకసారి కుజుడు తన రాశిని మారుస్తుంటాడు. ఇలా మారే క్రమంలో కొన్ని మంచి ఫలితాలను ఆయా రాశిచక్ర గుర్తులకు కలుగజేస్తుంటాడు. వచ్చే నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్న కుజుడివల్ల ప్రయోజనం పొందుతున్న రాశుల వివరాలను తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు విదేశాలకు వెళ్లాలని ఎప్పటినుంచో కలలు కంటున్నారు. ఈ సమయంలో ఆ కోరిక నెరవేరుతుంది. కొత్తగా ఆస్తిని కొనుగోలు చేస్తారు. అలాగే కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఈ రాశివారి అదృష్ట స్థానంలో కుజుడు ఉన్నాడు. దీనివల్ల ఏ పని తలపెట్టినా కలిసివస్తుంది. అలాగే సంపాదించిన డబ్బును ధార్మిక కార్యక్రమాలకు ఖర్చుపెట్టడంవల్ల మంచి జరుగుతుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు కుజుడిని పూజించాలి.

three zodiac signs will become millionaires due to mars will enter cancer

ధనుస్సు రాశి
వ్యాపారస్తులకు చాలా బాగుంది. కలిసివస్తుంది. మంచి ఆర్డర్లు దక్కుతాయి. ఉద్యోగస్థులకు జీతం పెరుగుతుంది.. దాంతోపాటు ప్రమోషన్ వస్తుంది. ఉద్యోగాలు రానివారికి వారు ఊహించనిరీతిలో మంచి జీతంతో ఉద్యోగం రానుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ఈ రాశివారు డబ్బులు ఖర్చుపెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులు చేస్తే నష్టపోతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి కుజుడిని పూజించడంవల్ల తిరుగులేని జీవితాన్ని పొందుతారు.

కన్యా రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అనూహ్యంగా ఆదాయం వస్తుంది. భారీ ఆర్థిక లాభాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి తగ్గేదే ఉండదు. ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఉన్న రుణాల నుంచి బయటపడాలంటే ఏప్రిల్ నెలలోనే. పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. కుటుంబంలో శుభకార్యాం ఉంది. ఆదాయంలో రోజురోజుకు పెరుగుదల ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+