జులైలో పేదవారిని కూడా కోటీశ్వరులుగా చేస్తున్న శని

చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు వచ్చే నెలలో మీనరాశిలో తిరోగమనదిశలో సంచారం చేస్తాడు. జులై 13వ తేదీ నుంచి 138 రోజులపాటు అదే దశలో ఉంటాడు. జాతకాల్లో శనిదేవుడు ఏ స్థానంలో ఉన్నా కొందరికి మంచి, మరికొందరికి చెడు పరిణామాలు ఎదురవుతాయి. అయితే మూడు రాశుల జీవితాల్లో మాత్రం మార్పులు చోటుచేసుకుంటాయి. వారికి అన్నివిధాలుగా కలిసివస్తుంది. నిజాయితీతో వ్యవహరించినవారికి శనిదేవుడు అంతకు రెట్టింపు ఫలితాలను అందిస్తాడు.

మీనరాశి
ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంపత్య జీవితంలో ఉన్నవారికి కొన్నాళ్లుగా సమస్యలున్నాయి. అవి ఈ సమయంలోనే పరిష్కారమవుతాయి. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. విదేశాలకు వెళ్లాలని కొన్నాళ్లుగా ప్రయత్నం చేస్తున్నవారు ఈ సమయంలో చాలా గట్టిగా ప్రయత్నిస్తే విజయం దక్కే అవకాశం కనపడుతోంది. విహార యాత్రలకు వెళ్లరావడంద్వారా మానసికంగా ఉల్లాసం కలిగి ఉత్సాహంతో పనులు చేస్తారు. ఏ పనినైనా పూర్తిచేయడానికి వీరికి అదృష్టం తోడుంటుంది. మేష రాశివారు, కుంభ రాశివారు, కర్కాటక రాశివారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ఉత్తమం.

three zodiac signs will become millionaires due to Saturn will enter pisces from July 13th

మకర రాశి
ఈ రాశికి చెందిన ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. వారి వేతనం పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం చాలావరకు మెరుగవుతుంది. గతం నుంచి వేధిస్తున్న అనేక అడ్డంకులన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. వ్యాపారాలు మాత్రం లాభసాటిగా మారతాయి. పెద్దల సలహా లేకుండా వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లో పెడితే తీవ్రంగా నష్టపోతారు. గురువు, కుటుంబ సభ్యులు, పెద్దల సలహాతోనే వీరు పెట్టుబడులను కొనసాగించాలి. బయటకు వెళ్లినప్పుడు ఎదుటివారితో ఎంత తక్కువ మాట్లాడితే అంత లాభం కలుగుతుంది.

తులా రాశి
ఒకరకంగా ఈ రాశివారికి ఇది బాగా కలిసివచ్చే సమయం అని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. పెట్టుబడులు కూడా భారీగా పెడతారు. చట్టపరమైన, న్యాయపరమైన సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నవారికి ఈ సమయంలో పూర్తిగా పరిష్కారం లభిస్తుంది. ఒకరకంగా వీరికి అదృష్టం బాగా కలిసిరాబోతోంది. దీనివల్ల ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. పదిమందికి సాయం చేస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+