షడాష్టక యోగంతో ఈ రాశులకు కుబేర యోగం
నవగ్రహాల్లో శనిదేవుడు, కుజుడు అత్యంత కీలకమైన గ్రహాలు. శని భగవానుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. కుజుడు సమయానుసారంగా రాశిని మారుస్తాడు. కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. జూన్ ఏడోతేదీన సింహరాశిలోకి ప్రవేశించి జులై 28వ తేదీ వరకు అదే రాశిలో సంచరిస్తాడు. ఆ సమయానికి శని మీనరాశిలో ఉంటాడు. వీరిద్దరూ కలిసి మూడు దశాబ్దాల తర్వాత శక్తివంతమైన షడాష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. దీని ప్రభావం మూడు రాశులపై ఉండనుంది. వీరి జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.
వృశ్చిక రాశి
పెద్ద పెద్ద సమస్యలను కూడ చాలా సులువుగా పరిష్కరిస్తారు. వ్యాపారం బాగా కలిసివస్తుంది. డబ్బులు సంపాదించడంతోపాటు పదిమందికి సాయం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నవారు ఉద్యోగాలను మారతారు. అనేక శుభవార్తలను విని సంతోషపడతారు. కొన్నింటివల్ల ఆర్థిక లాభాలున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. అందరూ తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. ఈ రాశివారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది.

మిథున రాశి
ఈ రాశివారి సంపద షడాష్టక యోగం వల్ల పెరుగుతుంది. వీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. వీరికి ఉద్యోగంతోపాటు వ్యాపారం కూడా కలిసివస్తుంది. కార్యాలయంలో పెద్ద పెద్ద బాధ్యతలను స్వీకరిస్తారు. అలాగే పెరిగిన వేతనంతో ప్రమోషన్ అందుకుంటారు. ధైర్యంతో, పరాక్రమంతో పనిచేసి విజయాలను సాధిస్తారు. కుటుంబ సభ్యలందరితో మాట్లాడి సలహాలు స్వీకరిస్తారు. శివాలయంలో, ఇతర ఆలయాల్లో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. శనిదేవుడిని, కుజుడిని పూజిస్తే మంచి జరుగుతుంది.
మీన రాశి
షడాష్టక యోగం వీరికి బాగా కలిసివస్తుంది. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామిపై అనుబంధం బాగా పెరుగుతుంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తిచేయగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలున్నాయి. అందరూ సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. మీతోపాటు మీ పిల్లలను కూడా తీసుకువెళతారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి.












Click it and Unblock the Notifications