ఏడాది మొత్తం అవసరం లేదు.. జనవరిలోనే ఈ రాశులు కోటీశ్వరులవుతారు
కొత్త సంవత్సరం వస్తుండటంతో ఆర్థికంగా తమకు బాగా కలిసివస్తుందనే ఆశతో రాశిచక్ర గుర్తులు ఉంటాయి. వచ్చేనెల నాలుగోతేదీన బుధుడు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి సంచారం చేస్తాడు. 24వ తేదీన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు జనవరి 14వ తేదీన మకర రాశిని వదిలిపెడుతుండటంతో మహా కుంభమేళా మొదలవుతుంది. అలాగే కుజుడు 21వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించి అనేక ప్రయోజనాలను కల్పించనున్నాడు. సంపదకు, లగ్జరీ జీవితానికి కారకుడైన శుక్రుడు 28వ తేదీన కుంభ రాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ ప్రభావం ఏ రాశులపై ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కుంభ రాశి
విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారు. జనవరిలోనే వీరికి అదృష్టం తలుపు తడుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంతో జీవిస్తారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. అన్ని పనులు ప్రారంభించేముందు నవగ్రహాలను పూజించుకోవడం మంచిది. జనవరి నెలమొత్తం ఈ రాశివారికి చాలా బాగుంటుంది. సంక్రాంతి తర్వాత శుభకార్యాలు ప్రారంభమవుతాయి. కుటుంబంలో శుభకార్యం ఉంది.

తులా రాశి
వీరికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. ఎంతో అనుకూలంగా అన్ని పనులు జరుగుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులు భాగస్వామి కోసం ఎదురుచూడకుండా సొంతంగానే వ్యాపారాన్ని నిర్వహించుకోవాలి. భాగస్వామితో చేయాలనుకుంటే గురువు సలహా తీసుకొని ఆ ప్రకారం నడుచుకోవాలని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వ్యాపారంలో ఉన్నవారు కొత్త వ్యాపారాలను ప్రారంభించే యోచన కూడా చేస్తున్నారు.
మేష రాశి
ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. పై అధికారులు పెద్ద పెద్ద బాధ్యతలను మీకు అప్పగిస్తారు. ఒంటరిగా జీవిస్తున్నవారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తులతో వివాహాలు కుదురుతాయి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. సంతోషంగా జీవిస్తారు. విహార యాత్రలకు లేదా తీర్థయాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications