షడష్టక యోగంతో ఈ రాశులకు నో ప్రాబ్లమ్?
గ్రహాలకు అధిపతి సూర్యుడు, కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు 150 డిగ్రీల దూరంలో కలుసుకోబోతున్నారు. దీనివల్ల షడష్టక యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. శని అమావాస్య రోజే ఇటువంటి శక్తివంతమైన యోగం ఏర్పడటం విశేషమని చెబుతున్నారు. ఈ పరిణామం ఈ నెల 23వ తేదీన జరుగుతుంది. జ్యోతిష్యం ప్రకారం ఈ యోగం చాలా శక్తివంతమైన యోగం. కొన్ని రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు, మరికొన్ని రాశులవారి జీవితాల్లో ప్రతికూల మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.
మిథున రాశి
ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య జీవితంలో ఉన్నవారికి సమస్యలు తలెత్తుతాయి. భార్యాభర్తలిద్దరూ గొడవ పడతారు. అయితే జీవిత భాగస్వామితో సఖ్యతగా, స్నేహంగా ఉండేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. అయినా ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు.

మీన రాశి
ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతాయి. వ్యాపారలు చేసేవారు తీవ్రమైన గందరగోళానికి గురవుతారు. ఆ సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు సూర్యుడిని, శనిని పూజించాలి.
కర్కాటక రాశి
ఈ సమయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాటను అదుపులో ఉంచుకోవాలి. చాలా మధురంగా, సున్నితంగా మాట్లాడాలి. స్నేహితులు పెరుగుతున్నారు. మాట కర్కశంగా ఉంటే ప్రత్యర్థులు పెరుగుతారు. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. అలాగే మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కుంటారు. ఇబ్బంది పడాల్సిన అవసరంలేదు. వ్యాపారాలను విస్తరించొద్దు.. లేదంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి పనిలో వివాదాలుంటాయి.. జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి.












Click it and Unblock the Notifications