హోలీ తర్వాత అరుదైన సూర్యగ్రహణం.. ఈ రాశులకు చాలా కష్టం
హోలీ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది జరిగిన 15 రోజుల తర్వాత అరుదైన సూర్య గ్రహణం ఏర్పడబోతోందని ఖగోళశాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు. 50 సంవత్సరాల కాలంలో ఈ తరహా గ్రహణం ఏర్పడలేదని చెబుతున్నారు. 7.30 నిముషాలు ఈ గ్రహణం ఉంటుంది. అయితే ఇది మనదేశంలో కనిపించదు. సూతక్ కాలం కూడా చెల్లదు. ఒకరకంగా ఇక్కడ ఈ గ్రహణానికి ప్రాముఖ్యత లేదు. అమెరికాలో బాగా కనిపిస్తుంది. పగటి సమయంలో కూడా రాత్రిలా చీకటి కమ్మేస్తుంది. 2030 వరకు ఈ తరహా సూర్యగ్రహణం సంభవించదు. మీనరాశిలో ఇది సంభవించనుంది. మొత్తం 12 రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ మూడు రాశులవారి జీవితాల్లో మాత్రం ప్రతికూల ప్రభావాలు ఎదురుకాబోతున్నాయి.
వృశ్చిక రాశి
వీరికి అశుభంగా ఉంటుంది. సమయమంతా కష్టంగా నడుస్తుంది. పనిచేసేచోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో ఇబ్బందులున్నాయి. ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.

తులా రాశి
వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు పెరుగుతాయి. మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రయాణాలు చేయాల్సివస్తే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి.
వృషభ రాశి
కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంతో జాగ్రత్తగా ఉండటంతోపాటు అనవసర కలహాలకు దూరంగా ఉండాలి.
వీరికి శుభం
మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఎంతో మేలు చేస్తుంది. సంపద పెరుగుతుంది. ఉద్యోగ విషయాల్లోనూ సంతృప్తి లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగంలో అధికారుల సహకారంతో పదవులను పొందుతారు. వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభం ఉంది.












Click it and Unblock the Notifications