2025లో ఈ రాశుల సుడి తిరిగింది... మహా రాజయోగం ఉంది

కేతువు ఇతర గ్రహాలకు నీడ. ఎప్పుడూ తిరోగమన దిశలోనే ప్రయాణిస్తుంటుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడానికి ఏడాదిన్నర సమయం తీసుకుంటుంది. శనిదేవుడు రాశి మార్చడానికి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటే కేతువు 18 నెలలు తీసుకుంటాడు. వేర్వేరు రాశుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ రాహువు, కేతువుల ప్రవర్తన ఒకేలా ఉంటుంది. 2025లో కేతువు తన రాశిని మార్చోబోతున్నాడు. కన్యారాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశి అనేది సూర్యుడి సొంత రాశి. ఈ ప్రభావంవల్ల రాజయోగం ఏర్పడి కొన్ని రాశులకు బాగా కలిసిరానుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.

తులా రాశి
అతి త్వరలోనే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు. దాంపత్య జీవితంచ చాలా బాగుంటుంది. పెళ్లికానివారికి ఈ సమయంలోనే పెళ్లి కుదురుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది. కొత్త సంవత్సరంలో జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆసుపత్రి ఖర్చులను భరించగలిగే స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వ్యాపారంలో ఊహించనిరీతిలో యోగం పడుతుంది.

three zodiac signs will gent amezing benefits in 2025 due to ketu transit in leo

మిథున రాశి
ఆధ్యాత్మిక జీవితంపట్ల వీరికి ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ఈ సంవత్సరం వీరికి బాగానే కలిసివస్తుంది. జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. అడుగుపెట్టిన అన్ని రంగాల్లోను విజయాలు అందుకుంటారు. చేపట్టే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ పెట్టాలి. ఆస్తికి సంబంధించి కొంతకాలంగా నలుగుతున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

మీన రాశి
ఈ రాశివారు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు. పనిచేసేచోట తోటి ఉద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వేతనం పెరుగుతుంది. వ్యాపారస్తులు బాగా వృద్ధి చెందుతారు. కొత్త వ్యాపారాలపై ఆలోచన చేస్తారు. ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక జీవతంపట్ల మొగ్గుచూపుతారు. అనవసర ఖర్చులు చాలావుంటాయి. వీటిని తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. ఎటువంటి గొడవలు ఉండవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+