ఈ రాశుల పంట పండిస్తున్న సూర్యుడు, శని
గ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు. చేసిన కర్మల ప్రకారం ఫలితాలనిచ్చేవాడు శనిదేవుడు. వీరిద్దరూ కలిసి కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నారు. జ్యోతిష్యం ప్రకారం వీరిద్దరిదీ తండ్రీ కొడుకుల సంబంధం. సూర్యభగవానుడి కుమారుడే శనిదేవుడు. ప్రస్తుతం సూర్యుడు మిథునరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ రాశిలో వీరిద్దరి కలయికే కేంద్ర యోగం. దీనివల్ల ఏయే రాశులు ప్రభావితమవుతున్నాయి? వారు ఎటువంటి ఫలితాలను అందుకుంటున్నారు? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారి సంపద చాలా వేగంగా పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు భారీగా పెరుగుతాయి. అయితే అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. విదేశీ ప్రయాణానికి అవకాశం ఉంది. శుభ ఫలితాలను అందుకుంటారు. మీరు ఇక రాదు అనుకున్న డబ్బు ఈ సమయంలో చేతికి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు.

కర్కాటక రాశి
ఈ రాశివారికి అదృష్టం తలుపు తడుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు చాలా లాభదాయక ఫలితాలున్నాయి. దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మంచి ప్రయోజనాలుంటాయి. ఆకస్మికంగా ధనలాభం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచే కాకుండా ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు కూడా మంచి లాభాలనిస్తాయి. పనిపరంగా ఇప్పటివరకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు.
మకర రాశి
ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. వ్యాపారం చేసేవారికి అనేక రూపాల్లో లాభాలు వస్తాయి. ఈ రాశివారు సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడి చేరుకుంటారు. జీవితంలో ఆనందంగా ఉంటారు. ఎక్కువ సమయాన్ని కుటుంబంతోనే కేటాయిస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. గతంలోకంటే మెరుగుపడుతుంది. జీవితంలో ఎదగడానికి ఇప్పటివరకు ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications