100 ఏళ్ల తర్వాత విపరీత రాజయోగం.. ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంటాయి. ఇలా మారే క్రమంలో కొన్ని మంచి యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఇలా ఏర్పడుతున్న రాజయోగమే విపరీత రాజయోగం. ఇది శుక్రుడి అనుగ్రహంతో ఏర్పడుతోంది. సంపదకు, కళలకు, ఫ్యాషన్స్ కు, విలాసవంతమైన జీవితానికి రాక్షసుల గురువైన శుక్రుడు కారకుడు. ఆయన వల్ల ఏర్పడుతున్న యోగం కాబట్టి కొన్ని రాశులకు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు దక్కుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహించడంవల్ల వీరికి తిరుగులేదని చెప్పొచ్చు.
కుంభ రాశి
సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. ఉద్యోగస్థులకు వేతనం పెరుగుదలతోపాటు ప్రమోషన్ ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. ఉన్నతస్థాయి పదవులు అందుతాయి. సమాజంలో మంచి ప్రభావంతమైన వ్యక్తుల నుంచి వీరికి మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. అదృష్టం వీరికి అనేకరకాల ప్రయోజనాలను మోసుకొస్తోంది.

తులా రాశి
వీరి జీవితంలో మంచి లాభాలను కళ్లచూడనున్నారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసివస్తుంది. పెళ్లికానికి పెళ్లవుతుంది. సంపన్న కుటుంబంతో సంబంధం కుదురుతుంది. ఈ ఏడాది కచ్చితంగా పెళ్లిపీటలు ఎక్కుతారు. సొంతంగా భూమిని లేదంటే ఇంటిని లేదంటే కారును కొనుగోలు చేస్తారు. పెళ్లయి పిల్లలు లేనివారికి ఇప్పుడు సంతాన యోగం ఉంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.
కర్కాటక రాశి
ఈ రాశివారి జీవితం చాలా ఆనందకరంగా సాగుతుంది. ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. సమస్యకు పరిష్కారం దొరుకుతుది. అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. వ్యాపారంలో అనుకోకుండా లాభం కలుగుతుంది. కెరీర్ పరంగా ఉద్యోగస్థులు మంచి స్థాయికి చేరుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. పదోన్నతి ఉంది.












Click it and Unblock the Notifications