2025 జనవరి 15లోపు ఈ రాశులవారికి అఖండ ధనయోగం
గ్రహాలకు రాజైన సూర్యుడు ఈనెల 15వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. నెలరోజులు అక్కడే సంచారం చేస్తాడు. ప్రతి నెలరోజులకు ఒకసారి తన రాశిని మార్చుకునే సూర్యుడి సంచారంవల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సంవత్సరానికి సూర్యుడి రాశి మార్పు ఇదే చివరిది కావడం విశేషం. సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు జనవరి 14వ తేదీ 2025 వరకు అక్కడే ఉంటాడు. ఈ క్రమంలో రాశిచక్ర గుర్తుల జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఏ రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం.
ఒక చిన్న విషయం: ఈ నెలరోజు సూర్యుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి కొత్త వ్యాపారాలు, కొత్త పనులు ప్రారంభించొద్దు. సూర్యుడి పూజ, తపస్సు, దానం, జపం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడతారు. పవిత్ర నదుల్లో స్నానం చేయడంవల్ల విశేషమైన లాభాలను పొందుతారు.

మేష రాశి
పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తిచేయడానికి ఇది చాలా మంచి సమయం. ఈ సమయంలోనే ఇవి పూర్తవుతాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులో మీకు అదృష్టం కలిసివస్తుంది. అనుకున్న పనులన్నీ అదృష్టం తోడుండటంవల్ల సులువుగా పూర్తిచేయగలుగుతారు. మీకు అన్ని పనుల్లో విపరీతమైన లాబాలున్నాయి. కుటుంబ సభ్యల మధ్య అనుబంధం బలపడుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ నెలరోజు సూర్యుడితోపాటు లక్ష్మీదేవిని ఆరాధించడంవల్ల అనేక ప్రయోజనాలను సొంతం చేసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.
మీన రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దాంపత్య జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో చెప్పి చేసే పనులవల్ల ఆర్థిక లాభం ఉంది. రుణాన్ని చెల్లించే సమయం ఇదే. సూర్యుడిని పూజించడంవల్ల మీరు అనేక ప్రయోజనాలను పొందబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
వృశ్చికం
తండ్రి వైపునుంచి మంచి లాభాలున్నాయి. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసిరానుంది. నిరుపేదలకు మీరు దానం చేస్తారు. అది మీ అదృష్టాన్ని పెంపొందిస్తుంది. వ్యాపారంతోపాటు ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా అభివృద్ధి బాటలో పయనిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొత్త శుభవార్తలను వింటారు. ఆర్థికంగా లాభాలున్నాయి. ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తారు. అదృష్టవంతులని చెప్పొచ్చు. ఈ నెలరోజులు సూర్యుడిని, లక్ష్మీదేవిని, నారాయణుడిని పూజించండి.












Click it and Unblock the Notifications