జ్యేష్ఠ నక్షత్రంలోకి బుధుడు... ఈ రాశులపై కనక వర్షం
జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో కీలకమైన బుధుడు గ్రహాల రాకుమారుడు. బుధుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేసే సమయంలో మంచి ప్రయోజనాలు రాశి చక్ర గుర్తులకు కలుగుతాయి. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈనెల 24వ తేదీన జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడికి జ్యేష్ఠ అంటే ఎంతో ఇష్టం. దీనివల్ల కొన్ని రాశులవారి కోరికలన్నీ సులువుగా నెరవేరతాయి. జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. సంతోషం వెల్లివిరుస్తుంది. కొన్ని రాశులవారైతే జీవితంలో ఎన్నడూ పొందని డబ్బును పొందుతారు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కన్యా రాశి
ఈ రాశివారికి మేథస్సు ఊహించని స్థాయిలో పెరగడమే కాకుండా సమాజంలో పేరు తెచ్చుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. గతంలో కంటే ఈసారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థికంగా బలవంతులవుతారు. డబ్బును పొదుపు చేసే విషయంలో సొంత నిర్ణయాలకన్నా కుటుంబ సభ్యుల నిర్ణయం లాభాలనిస్తుంది. గురువు సలహాలతో ప్రారంభించిన పనుల్లో విజయం కలిసివస్తుంది.

వృశ్చిక రాశి
వీరికి అన్ని ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కోర్టు కేసులు నడుస్తున్నవారికి ఇది మంచి సమయం. అనుకూలంగా తీర్పు వస్తుంది. కేసుల నుంచి బయటపడతారు. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. మంచి లాభాలు కలుగుతాయి. దాంపత్య జీవితంలో ఉన్నవారు ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థికంగా కలిసివస్తుంది.
మిథునరాశి
ఈ రాశివారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారస్తులకు కలిసివస్తుంది. వ్యాపారాలన్నీ లాభసాటిగా ఉంటాయి. పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఉద్యోగంలో ఉన్నవారు, వ్యాపారాల్లో ఉన్నవారు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.












Click it and Unblock the Notifications