120 రోజులు ఈ రాశులకు తిరుగులేదు.. అద్భుత ధనయోగం
నవగ్రహాల్లో కీలక గ్రహమైన బృహస్పతి దేవతలకు గురువు. జ్ఞానానికి, వివాహానికి, సంతానానికి, ఆధ్యాత్మికతకు, జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు కారకుడు. ప్రస్తుతం మిథునరాశిలో సంచారం చేస్తున్న గురువు అక్టోబరులో తన రాశిని మార్చబోతున్నాడు. అక్కడి నుంచి నవంబరు 11వ తేదీన కర్కాటక రాశిలో తిరోగమనం చేస్తాడు. అక్కడి నుంచి డిసెంబరు నాలుగో తేదీన తిరిగి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం కొన్ని రాశులపై ప్రతికూలంగా, మరికొన్ని రాశులపై అనుకూలంగా పడుతోంది. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. పెద్దల సలహాతో, గురువు సలహాతో చేసే వ్యాపారాలు బాగా సాగుతాయి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగస్థులకు మంచి ఆర్జన ఉంటుంది. కెరీర్ పరంగా వీరికి చాలా బాగుంటుంది. పదోన్నతి ఉంది. వేతనం పెరుగుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి
జీవితంలో మంచి సంపదను పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వివాహం ఆలస్యమవడానికి అవకాశం ఉంది. డిప్రెషన్ లోకి వెళ్లొద్దు. అదనపు ఆదాయానికి అవకాశాలు వస్తాయి. వాటిని ఉపయోగించుకుంటే మంచి స్థాయికి వెళతారు. సమాజంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కోరుకున్నవన్నీ తీరతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
మిథున రాశి
పిల్లల వైపు నుంచి ఎటువంటి సమస్యలు ఉండవు. కెరీర్ పరంగా అనేక విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో లాభాలుంటాయి. వచ్చిన డబ్బును పెట్టుబడి పెడతారు. అదనపు ఆదాయానికి కొత్తగా మార్గాలు దొరుకుతాయి. ఈ రాశివారికి మంచి ప్రయోజనాలున్నాయి. గురువు తిరోగమనంతో వీరు పట్టుకుందల్లా బంగారమే అవుతుంది.












Click it and Unblock the Notifications