మేషరాశిలో శుక్రుడు... ఈ రాశులకు అఖండ ధనయోగం
నవగ్రహాల్లో అత్యత కీలకమైన గ్రహం శుక్రుడు. సంపదకు, విలాసాలకు, ఐశ్వర్యానికి, అందానికి, శ్రేయస్సుకు, ప్రేమకు ప్రతీక అయిన శుక్రుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న శుక్రుడు వచ్చే నెల 31వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ నెల చివరి వరకు మేషరాశిలోనే సంచారం చేస్తాడు. దీనివల్ల మూడు రాశలైన మిథునరాశి, తులారాశి, మేషరాశివారికి బాగా కలిసివస్తోంది. ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంటారు. వీరికి ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మేష రాశి
ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు బలపడతారు. వ్యాపారస్తులకు అన్నీ లాభాలే ఉన్నాయి. కొత్త వ్యాపారాలతోపాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల నలుగురికి సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండటంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేసి మంచి స్థాయికి వెళతారు. ప్రతి పనిలోను మీకు అదృష్టం తోడుంటుంది.

మిథున రాశి
ఒంటరి జీవితం గడుపుతున్న వ్యక్తుల జీవితాల్లోకి నూతన వ్యక్తి ప్రవేశం ఉంటుంది. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. జీవితంలో మంచి స్థాయికి చేరుకోవడానికి, కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశాలు లభిస్తాయి. గతంలో వేరేవారివద్ద నిలిచిపోయిన డబ్బును తిరిగి ఈ సమయంలో మీరు పొందగలుగుతారు. ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదు. కుటుంబ సభ్యుల్లో ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.
తులా రాశి
పిల్లలకు సంబంధించి పలు శుభవార్తలు చెవినపడటంతో ఆనందిస్తారు. వ్యాపారస్తులకు చాలా బాగుంది. వచ్చే డబ్బుతో ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారు. పెద్దల సలహాలు తీసుకోవాలి. మనసంతా సంతోషంతో నిండిపోతుంది. డబ్బు వస్తుందికానీ దానిపై మీరు నియంత్రణ తెచ్చుకోవాలి. ఖర్చులను నియంత్రించలేకపోతే నష్టపోతారు.












Click it and Unblock the Notifications