నిన్నటి నుంచే ఈ రాశుల దశ తిరిగింది
జ్యేష్ఠ మాసం ముగియబోతోంది. ఈరోజు వచ్చిన మంగళవారమే ఈ మాసంలో చివరి మంగళవారం. దీన్ని జ్యోతిష్యం ప్రకారం పెద్ద మంగళవారం, బడా మంగళవారం అని పిలుస్తుంటారు. ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారం కూడా లభిస్తుంది. ఇదే రోజున రవియోగం ఏర్పడింది. దీనివల్ల విశేషమైన లాభాలున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ రెండు పరిణామాలవల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కుంభరాశి
ఆస్తికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో పెడితే భారీ మొత్తంలో లాభాలను కూడగట్టే అవకాశం ఉంది. కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి. వచ్చిన డబ్బును పొదుపు చేయాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల్లో సంతోషం నెలకుంటుంది. సమాజంలో గౌరవం కలుగుతుంది. వ్యాపార సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.

వృశ్చిక రాశి
ఈ మంగళవారం నుంచి వీరికి బ్రహ్మాండంగా కలిసిరానుంది. ఆంజనేయుడి అనుగ్రహంతో ఈ రాశివారు విశేషమైన ప్రయోజనాలను, లాభాలను పొందుతారు. కుజుడి అనుగ్రహం వీరికి బాగా లభిస్తుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళన అవసరంలేదు. అన్ని సమస్యలకు ఈ సమయంలో పరిష్కారాలు దొరుకుతాయి. చింత పడాల్సిన అవసరంలేదు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది.
మేష రాశి
ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. అందుకు అదృష్టం కూడా వీరికి తోడుంటుంది. ఈ రాశికి కుజుడు అధిపతి కావడంవల్ల అన్నిరంగాల్లోను తిరుగులేని విధంగా ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. ఉద్యోగస్థులకు పదోన్నతితోపాటు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు వస్తాయి.












Click it and Unblock the Notifications