ఈ నెల 18 నుంచి ఈ రాశులకు అన్నీ బంగారు రోజులే
ఆగస్టు నెలలో కీలక పరిణామం సంభవించనుంది. మిథున రాశిలో మూడు గ్రహాలు కలుస్తాయి. ఈనెల 18న చంద్రుడు మిథునరాశిలోకి సంచారం చేస్తాడు. ప్రస్తుతం బృహస్పతి, శుక్రుడు కూడా ఇదే రాశిలో సంచరిస్తున్నారు. గురువు ఒక్కో రాశిలో 12 నెలలు ఉంటుంది. శుక్రుడు 23 రోజుల నుంచి 60 రోజుల వరకు ఉంటాడు. ఇలా మూడు గ్రహాలు ఒకేరాశిలో కలుస్తుండటంవల్ల కొన్ని రాశిచక్ర గుర్తులకు బంగారు రోజులు ప్రారంభమవుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇక్కట్లన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి
ఈ రాశివారు చాలా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తిలో ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నవారు, ఉద్యోగం చేస్తున్నవారు కూడా మంచి లాభాలను పొందుతారు. కుటుంబంలోను, బయట కూడా వీరు మంచి విజయాలను సాధిస్తారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు గురువును, శుక్రుడిని పూజించాలి. శుక్రుడు సంపదను కలిగిస్తే, గురువు జీవిత లక్ష్యంవైపు నడిపిస్తాడు.

తులా రాశి
కుటుంబంతోపాటు బయట కూడా మంచి గౌరవాన్ని అందుకుంటారు. పనితీరుపై ప్రశంసలు వస్తాయి. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అంతేకాదు.. వారు కోరుకున్న కంపెనీలో ఉద్యోగం వస్తుంది. శివాలయంలో, ఆంజనేయస్వామి ఆలయాల్లో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.
కర్కాటక రాశి
నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. అంతేకాకుండా వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారు వ్యాపారంలో గొప్ప అవకాశాలను పొందుతారు. ఒకరకంగా వీరికి అన్నీ శుభాలే జరుగుతాయని చెప్పొచ్చు. దాంపత్య జీవితం చాలా మధురంగా సాగుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జీవిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications