ఈ రాశుల తలరాతను మారుస్తున్న బుధుడు... మీది సంపన్న కుటుంబమవుతోంది
నవగ్రహాల్లో అత్యంత కీలకమైన బుధుడిని గ్రహాలకు రాకుమారుడిగా పరిగణిస్తారు. ఆయన ఆశీర్వదించాడంటే రాశులపై డబ్బుల వర్షం వద్దన్నా కురుస్తుంది. బుధుడు సంచారం చేయబోతుండటంతో మూడు రాశులవారికి అదృష్టం పట్టుకుంటోంది. రేపు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి వచ్చేనెల 16వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. 21 రోజులపాటు మూడు రాశులవారి తలరాతను బుధుడు మార్చబోతున్నాడు. ఏ రాశులకు అదృష్టం కలిసివస్తుందో, ఎలా కలిసివస్తుందో తెలుసుకుందాం.
సింహం
ఉద్యోగం రానివారు ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే వారి ఎదురుచూపులు ఫలిస్తాయి. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. ఈ సమయంలో ఖర్చు తక్కువగా ఉండటంవల్ల డబ్బు నిలబడుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ కొన్ని కారణాలవల్ల భారీగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కలగడంతోపాటు వేతనం పెరుగుతుంది. దాంపత్య జీవితం చాలా ఆనందకరంగా గడుస్తుంది.

వృశ్చికం
ఉద్యోగరీత్యా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆర్థికంగా కలిసివస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి వారి సంబంధాలు విజయవంతమవుతాయి. తల్లిదండ్రులు పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. బుధుడి కదలిక ఈ రాశివారికి ఎంతో సానుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. ఈ రాశివారికి విపరీతమైన సంపద యోగం ఉంది.
వృషభం
ఈ రాశివారి ఆదాయం బుధుడి సంచారంవల్ల విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను స్నేహితుల సహకారంతో మొదలుపెడతారు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అన్నివైపుల నుంచి ఆదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి. వచ్చిన డబ్బును భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపైనే మీ గొప్పతనం ఆధారపడివుంటుంది. ఆడంబరాలకు వెళ్లకూడదు.












Click it and Unblock the Notifications