అక్టోబరు 2 నుంచి ఈ రాశులకు అంతులేని రాజభోగాలు, రాజపూజ్యాలు
అక్టోబరు రెండోతేదీతో మహాలయ అమావాస్య ముగుస్తోంది. కీలకమైన గ్రహాలు కూడా ఈ నెలలోనే సంచారం చేస్తున్నాయి. దీనివల్ల ఎంతో శక్తివంతమైన సర్వార్థ సిద్ధియోగం బుధవారం నుంచి ఏర్పడింది. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులవారు విపరీతమైన ధనలాభాన్ని పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కొన్ని తిథుల్లో జన్మించినవారికైతే ఎంతో మేలు కలుగుతోంది. సర్వార్థ సిద్ధి యోగంవల్ల ఏయే రాశులవారికి ఏవిధంగా ఆర్థికంగా కలిసిరాబోతోందనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
ఈ రాశివారు ఎటువంటి పని తలపెట్టినా విజయం సాధిస్కతారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలన్నీ పరిష్కారమవుతాయి. ఆర్థికంగా పరిస్థితులన్నీ చక్కబడటంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరి మధ్య అనుబంధం బలోపేతమవుతుంది. అన్ని సమస్యలను చక్కదిద్దుకుంటారు. వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అనారోగ్యం నుంచి బయటపడతారు.

వృశ్చిక రాశి
ఈ రాశివారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. ఏ పని తలపెట్టినా వీరికి అద్భుతమైన విజయాలు దక్కుతాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తారు. దాంపత్య జీవితంలో వస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీతిరిగి ఈ సమయంలోనే ప్రారంభమవుతాయి. వాటిని చాలా సులువుగా పూర్తిచేస్తారు.
కన్యా రాశి
వీరికి అదృష్టం తోడుండటంవల్ల అనుకున్న పనులన్నీ నెరవేరతాయి. ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తారు. వీటివల్ల ఎన్నో ప్రయోజనాలు అందుకుంటారు. దాంపత్య జీవితం సంతోషంగా గడుస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications