హోలీ పండగ నుంచి ఈ రాశుల దశ, దిశ తిరుగుతోంది.. మహర్జాతకులవుతున్నారు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు మంచి ఫలితాలు, మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంటాయి. ప్రపంచానికి వెలుగు, ఆ వెలుగు ద్వారా ఆరోగ్యాన్ని పంచే సూర్యభగవానుడు మార్చిలో హోలీ పండగ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్యం ప్రకారం మార్చి నెల అంటే చాలా కీలకమైన నెల. కొన్ని గ్రహాలు ఈనెలలోనే తిరోగమన దిశలో పయనిస్తాయి. నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడంవల్ల ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
సింహ రాశి
ఈ రాశివారి కెరీర్ కు సంబంధించి ఊహించనిరీతిలో మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారస్తులకు అనుకోకుండా కలిసిరావడంతోపాటు వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు చేస్తారు. డబ్బులు సంపాదించడానికి ఇది వారికి మంచి సమయం అని చెప్పొచ్చు. అయితే డబ్బు వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలనే విషయంలో పెద్దల సలహాలు, సూచనలు పాటించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడిని పూజించాలి.

మిథున రాశి
ఈ రాశివారి ఆదాయం రెట్టింపు అవడంతోపాటు అదనపు ఆదాయానికి మార్గాలు కూడా దొరుకుతాయి. ఉద్యోగస్థుల జీవితాల్లో మార్పు ఉంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ సమయంలో పెట్టవచ్చు. వారికి ఇది తిరుగులేని సమయం అని పండితులు తెలియజేస్తున్నారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.
మకర రాశి
ఈ రాశివారి జీవితంలో ఎంతో సంతోషం నెలకుంటుంది. వ్యాపారాలు చేసేవారికి మాత్రం భారీ లాభాలున్నాయి. ఆనందం రెట్టింపు అవడంతోపాటు కుటుంబంలో పండగ వాతావరణం నెలకుంటుంది. ఎటువంటి పని తలపెట్టినా అద్భుతమైన లాభాలను ఆర్జిస్తారని, ఎంతో సమర్థవంతంగా పనులు పూర్తిచేస్తారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వ్యాపారాలు చేసేవారు తాము ఆర్జించే లాభాలను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులవైపు మళ్లిస్తారు. అలాగే భవిష్యత్తులో రాబడి వచ్చేలా పొదుపు చేసుకోవడంపైనే సమర్థత ఆధారపడివుంటుంది. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం గురించి ఆందోళన అవసరంలేదు.












Click it and Unblock the Notifications