అశ్విని నక్షత్రంలోకి సూర్యుడు... ఈ రాశుల ఇంట్లోకి లక్ష్మీదేవి
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఈనెల 14వ తేదీన అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించాడు. గ్రహాలు రాశులతోపాటు నక్షత్రాలను కూడా మారుస్తుంటాయి. ఇలా నక్షత్రాలను మార్చే క్రమంలోనే సూర్యుడు అశ్వినిలోకి సంచారం చేశాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటున్నప్పటికీ ప్రధానంగా మూడు రాశులకు మంచి ప్రయోజనాలను తెస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అశ్విని నక్షత్రం కేతువు సొంత నక్షత్రం.
సింహ రాశి
అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కుటుంబంలో కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఉద్యోగస్థులు పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. అలాగే మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్నచోట మీకు అనుకూలంగా పరిణామాలన్నీ మారిపోతాయి. డబ్బుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. మంచి ఆరోగ్యవంతులవుతారు.

వృశ్చిక రాశి
ఉద్యోగంలో మంచి లాభాలున్నాయి. తీవ్రమైన పోటీ కూడా ఉంటుంది. అయితే ఈ పోటీ వీరికి వృద్ధిని కల్పిస్తుంది. ఈ రాశికి సంబంధించిన 10వ ఇంట్లో సూర్యుడు సంచారం చేస్తున్నాడు.. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మొత్తం మారిపోతుంది. శత్రువుల నుంచి వచ్చే సమస్యలన్నీ తగ్గుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం మంచి ఫలితాలను కలిగిస్తుంది. సూర్యభగవానుడిని పూజించండి.
మిథున రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. పెద్దల సలహాలతో ఇతర వ్యాపారాల్లోకి డబ్బును పెట్టుబడిగా పెడతారు. కొత్తగా ఆదాయ మార్గాలు తోడవుతాయి. విద్య, ఉద్యోగం విషయం చాలా బాగుంటుంది. ఇందులో ఉన్నవారికి మంచి వృద్ధి ఉంది. కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు. మొదటినుంచి మీకు ఉన్న కోరికలన్నీ ఈ సమయంలో నెరవేర్చుకుంటారు.












Click it and Unblock the Notifications