16వ తేదీ నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ప్రస్తుతం మిథునరాశిలో సంచారం చేస్తున్న సూర్యభగవానుడు ఈనెల 16వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి మరో 30 రోజులు ఆగస్టు 17 వరకు అక్కడే ఉంటాడు. ఇటువంటి పరిణామాల మధ్య మూడు రాశులకు అద్భుతమైన అదృష్టం కలిసివస్తోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు వారు చెప్పిన విధంగా అదృష్టం వరిస్తుందనే వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
సమాజంలో వీరికి అద్భుతమైన గౌరవం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం చేసేవారికి చాలా బాగా కలిసివస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. వినియోగదారులు పెరుగుతారు. ఉద్యోగస్తులు వారు పనిచేస్తున్నచోట మంచి పేరు తెచ్చుకుంటారు. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అంతేకాకుండా కోరుకున్నచోటకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు సూర్యుడిని పూజించాలి.

సింహ రాశి
ఉద్యోగులకు చాలా బాగుంటుంది. వారికి వేతనాలు పెరగడంతోపాటు పదోన్నతులున్నాయి. కెరీర్ పరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. వీరు ఏ పని తలపెట్టినా కలిసివస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. కొన్నిరోజులపాటు వీరికి తిరుగులేదని చెప్పొచ్చు. ఆర్థికంగా వచ్చే లాభాలను జాగ్రత్తగా పెట్టుబడుల వైపు మళ్లించుకోవాలి. విద్యార్థులకు బాగుంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారు గట్టిగా ప్రయత్నం చేయాలి.
కన్యారాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. అందరూ ఐకమత్యంగా ఉంటారు. తీర్థయాత్రలకు వెళతారు. ఈ రాశివారు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ఆలోచించి జాగ్రత్తగా అడుగు వేయాలి. ఆ తర్వాత తిరుగుండదు.












Click it and Unblock the Notifications