ఈనెల 28వ తేదీ నుంచి ఈ రాశుల తలరాత మారిపోతోంది

ఆరుద్ర నక్షత్రంలో పరమేశ్వరుడు జన్మించాడు. అది ఆయన జన్మ నక్షత్రం. దేవతల గురువైన బృహస్పతి గత నెల 14వ తేదీ నుంచి ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తోంది. ఈ నెల 28వ తేదీన అదే నక్షత్రం నాలుగో పాదంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి రాహువు అధిపతి. సంతానానికి, వివాహానికి, జ్ఞానానికి, వ్యాపారానికి, తెలివితేటలకు కారకుడైన గురువు జాతకంలో బలంగా ఉంటే జీవన పరిస్థితి బాగుంటుంది. వచ్చే నెల 12వ తేదీ వరకు అక్కడే ఉండి తర్వాత పునర్వసు నక్షత్రంలోకి గురువు సంచారం చేస్తాడు. ఈ పరిణామాలతో ఏయే రాశులకు ఏవిధంగా బృహస్పతి మేలు చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం.

సింహ రాశి
నిరుద్యోగులకు, ఉద్యోగం చేస్తున్నవారికి కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపుతడతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. పెట్టుబడి విషయంలో మాత్రం పెద్దల సలహా తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. బృహస్పతి నక్షత్ర సంచారం ఒకరకంగా వీరికి వరం అని చెప్పొచ్చు. అనేక అవకాశాలను వినియోగించుకుంటే జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు.

three zodiac signs will get huge financial benefits from 28th this month due to Jupiter will enter aarudra nakshatram 4th foot

మిథున రాశి
స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో మీ సంబంధాలు బలోపేతం అవుతాయి. కెరీర్ ప్రారంభించేటప్పుడు కూడా వీరి సలహా తీసుకుంటారు. అవగాహనతోనే కెరీర్ ప్రారంభించడంతోపాటు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వైవాహిక జీవితంలో ఉన్నవారికి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యంపై మాత్రం ఈ రాశివారు చాలా శ్రద్ధ చూపించాలి.

ధనుస్సు రాశి
ఉద్యోగంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. దీనికి స్నేహితుల నుంచి, సన్నిహితుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగ జీవితం సంతోషంగా గడుస్తుంది. వృత్తి జీవితంలో ఉన్నవారు కూడా ఆనందంగా ఉంటారు. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. జీవితంలో ఎదురవుతున్న కష్టాలన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+