మార్చిలో కోటీశ్వరులు కాబోతున్న రాశులు వీరే
మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించేవారు శనిదేవుడు. ఆయన నీతికి, నిజాయితీకి ప్రతిరూపం. ఇలా ఎవరైతే ఉంటారో వారిని బాగా ఇష్టపడతాడు. శని అంటే అందరూ భయపడతారు. కానీ ఆయన ఎంతో మంచి చేస్తాడు. జీవితాన్ని అర్థం చేసుకునేలా చేస్తాడు. జాతకంలో శని ప్రభావం ఉన్నప్పటికీ చివరలో ఆయన చేసే మేలును ఉపయోగించుకుంటే జీవితానికి ఓ అర్థం దొరుకుతుంది. మనం చూసేదాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి ఫలితం ఆధారపడివుంటుంది. ఆయన ఆశీర్వాదం పొందితే చాలు కోటీశ్వరులవుతారు. మార్చిలో మీనరాశిలోకి ప్రవేశిస్తున్న శనిదేవుడివల్ల కొన్ని రాశులకు అదృష్టం ఫెవికాల్ లా అతుక్కుంటుంది. శనిదేవుడి బలం వల్ల మార్చి నెలలో మిలియనీర్లు కాబోతున్న రాశుల వివరాలను తెలుసుకుందాం.
మేషరాశి
వ్యాపారంలో లాభార్జన భారీగా ఉంటుంది. వచ్చిన డబ్బును ఇతర పెట్టుబడులపైకి మళ్లిస్తారు. అంతేకాకుండా వీరికి అనుకోకుండా ఆకస్మిక ధనలాభం ఉంది. శని భగవానుడి విశేష కృపవల్ల ఈ రాశులవారు జీవితంలో స్థిరపడతారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది.

ధనస్సు రాశి
విద్యార్థులకు చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు విజయాలను సాధిస్తారు. ఈ పనులకు ఇది చాలా మంచి సమయం. ప్రతి పనిలోను వీరికి తిరుగుండదు. కెరీర్ పరంగా పురోగతి ఉండదు. వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులను సురక్షిత మార్గాలవైపు మళ్లించకపోతే నష్టపోతారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి
ఈ రాశివారికి అదృష్టం బ్రహ్మాండంగా కలిసివస్తుంది. డబ్బులు కూడా ఆకస్మికంగా వస్తాయి. వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కుటుంబ సభ్యులందరి మధ్య అనుబంధం బలపడుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరించడంతోపాటు ఇతర వ్యాపారాలపై పెట్టుబడి పెడతారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. కెరీర్ చాలా బాగుంటుంది.












Click it and Unblock the Notifications