మే నెలలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల దశ, దిశ మారిపోతోంది
జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో గ్రహాల కదలికలకు సంబంధించి మే నెల చాలా కీలకం. మేషరాశిలో శుక్రుడు, బుధుడు కలుస్తాయి. దీనివల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ ప్రత్యేకించి కొన్ని రాశులపై మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఈ యోగంవల్ల వ్యక్తుల వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు లాభాలను ఆర్జిస్తారు. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.
కుంభరాశి
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నవారికి ఇది మంచి సమయం. ఇప్పుడు ప్రవేశిస్తే భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగం, వ్యాపారం.. ఈ రెండూ వీరికి అనుకూలంగా ఉన్నాయి. గతంలో పోగొట్టుకున్న డబ్బును ఈ సమయంలో తిరిగి పొందుతారు. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు బాగా మెరుగవుతారు. శివాలయాల్లో, ఇతర ఆలయాల్లో ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బుధుడిని, శుక్రుడిని పూజిస్తే మంచి జరుగుతుంది.

మిథున రాశి
దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తారు. ఈ రాశిలో పుట్టినవారికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. ఆదాయం భారీగా పెరుగుతుంది. మీ వ్యక్తిత్వానికి ముగ్ధులై చాలామంది మీకు స్నేహితులవుతారు. వారే సన్నిహితులవుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నవారు కూడా ఈ సమయంలోనే అడుగు ముందుకు వేయాలి.
కర్కాటక రాశి
వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలున్నాయి. వచ్చిన లాభాలను ఇతర వ్యాపారాలవైపు మళ్లిస్తారు. మీరు చేసే పనిని ప్రతి ఒక్కరు కొనియాడతారు. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు కొత్తగా ఉద్యోగాలను పొందుతారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం.. ఇలా అన్ని రంగాల్లో మంచి లాభాలున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలున్నాయి. అవన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. శివాలయాల్లో, ఇతర ఆలయాల్లో ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంవల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications