ఆగస్టు 18న త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల పంట పండింది
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని శుభ పరిణామాలను, మరికొన్ని అశుభ పరిణామాలను కలిగిస్తాయి. ఈ నెల 18వ తేదీన చంద్రుడు మిథునరాశిలోకి సంచారం చేస్తాడు. ఆ సమయానికి అదే రాశిలో శుక్రుడు, గురువు కూడా సంచారం చేస్తుంటారు. ఇలా మూడు గ్రహాలు మిథునరాశిలో కలుసుకోవడంవల్ల త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశులవారు అనేక ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్నవారికి ఈ సమయం కలిసివస్తుంది. ఈ రాశివారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అవి సఫలీకృతమవుతాయి. అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. ఆదాయం పెరిగి ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. ఏ పని తలపెట్టినా కుటుంబ సభ్యుల నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభిస్తుంది. అదృష్టం కలిసివస్తుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి గురువును, శుక్రుడును పూజించాలి.

తులా రాశి
విద్యార్థులకు మాత్రం ఇది బంగారు సమయం అని చెప్పొచ్చు. వారికి అన్నివిధాలుగా కలిసివస్తుంది. విదేశీ విద్య కోసం ఎదురుచూస్తున్నవారి కోరిక నెరవేరుతుంది. తులారాశివారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సమాజంలో మంచిపేరు వస్తుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలను అందుకుంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి.
కన్యా రాశి
అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. సంగీతం, మార్కెటింగ్, నృత్య రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని భార్యాభర్తలిద్దరూ చవిచూస్తారు. అన్యోన్యంగా ఉంటారు. సంపాదన పెరుగుతుంది.












Click it and Unblock the Notifications