30 ఏళ్ల తర్వాత ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదకు, సౌందర్యానికి, వైభవానికి కారకుడు శుక్రుడు. శనిదేవుడు చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి. జ్యోతిష్య శాస్త్రం శుక్రుడు, శని గ్రహాలను ఎంతో స్నేహపూర్వకంగా ఉండే గ్రహాలుగా చెబుతుంది. వచ్చే నెల 28వ తేదీన ఈ రెండూ కుంభరాశిలో కలవబోతున్నాయి. దీనివల్ల మూడు రాశులవారికి ఆర్థిక లాభాలతోపాటు జీవితంలో మంచి అభివృద్ధి సాధ్యపడుతుంది. ఆ రాశులవారి వివరాలను, వారికి ఏవిధంగా కలిసిరాబోతుందనే విషయాలను తెలుసుకుందాం.
మిథునం
గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి హఠాత్తుగా పెద్ద రాబడిని పొందుతారు. గతంలో మొదలై నిలిచిన పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. అందుకు అదృష్టం తోడుంటుంది. విద్యార్థులు కూడా చదువులో పూర్తిగా రాణిస్తారు. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. రాబడి పెరగడంతోపాటు అదనపు ఆదాయ మార్గాలద్వారా సంపన్నులవుతారు.

మేష రాశి
స్టాక్ మార్కెట్ తోపాటు దానికి సంబంధంగా ఉండేవాటిల్లో పెట్టుబడులు పెట్టినవారికి మంచి ఆదాయం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. ఉద్యోగస్తులకు కెరీర్ చాలా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో హాయిగా ఉండొచ్చు. అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు, డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించడంతోపాటు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
కుంభం
వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు. పెళ్లికానివారికి పెళ్లిక సంబంధించిన ప్రతిపాదనలు వస్తాయి. ఆర్థికంగా పరిస్థితి బలపడుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. సంపద కలుగుతుంది. అదనపు ఆదాయం వస్తుంది. డబ్బును పొదుపు చేయడంపైనే మీ విజయం ఆధారపడివుంటుంది.












Click it and Unblock the Notifications