కుజుడి తిరోగమనంతో ఈ రాశుల సంపద అనూహ్యంగా పెరగబోతోంది

నవగ్రహాల్లో కీలకమైన గ్రహం కుజుడు. పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, బలానికి, ఆగ్రహానికి కారకుడు. కుజుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేసేందుకు 45 రోజుల సమయం తీసుకుంటాడు. ఇలా సంచారం చేసే సమయంలో కుజుడి ప్రభావం మొత్తం ద్వాదశ రాశులపై పడుతుంది. ప్రస్తుతం తిరోగమనదిశలో పయనిస్తున్న కుజుడి వల్ల మూడు రాశులవారికి మంచి లాభాలు కలుగుతున్నాయి. అనేకరకాల ఆర్థిక ప్రయోజనాలుంటాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా కుజుడివల్ల లాభాలు కలుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం.

సింహ రాశి
కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. అలాగే కొత్త వాహనాన్ని కూడా కొంటారు. వ్యాపారస్తులకు రెట్టింపు స్థాయిలో లాభాలున్నాయి. భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు మంచి స్థితికి చేరుకుంటారు. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వాటిని ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. అలాగే ఎదుటివారితో మాట్లాడే సమయంలో మాటతీరు మార్చుకోవాలి. సౌమ్యంగా మాట్లాడటంవల్ల అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.

three zodiac signs will get huge money due to mars retrograde

మిథున రాశి
ఆదాయం పెరుగుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేయగలుగుతారు. ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా సులువుగా సాధిస్తారు. అనేక మార్గాలద్వారా ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ధైర్యంగా పెట్టడంవల్ల భవిష్యత్తులో మంచి లాభాలను అందుకుంటారు.

తులారాశి
కుటుంబంలో శుభకార్యాలున్నాయి. ప్రేమలో ఉన్నవారికి జీవితం ఆనందంగా గడుస్తుంది. చేస్తున్న ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వీటివల్ల కూడా మంచి లాభాలు కలుగుతాయి. డబ్బు సంపాదన తర్వాత జాగ్రత్తగా పొదుపు చేయకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. సన్నిహితుల నుంచి, బంధువుల నుంచి, కుటుంబంలో పెద్దల నుంచి సలహాలు తీసుకొని ఆ డబ్బును భవిష్యత్తులో రాబడి వచ్చేలా పెట్టుబడి పెట్టాలి. సొంత ఆలోచనలతో పెట్టకూడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+