బుధుడు, శుక్రుడు కలిసి ఈ రాశుల నెత్తిన పాలుపోస్తున్నారు

తెలివితేటలు, జ్ఞానానికి, తర్కానికి, వ్యాపారానికి కారకుడు బుధుడు. సంపదకు, విలాసవంతమైన జీవితానికి, కళలకు కారకుడు శుక్రుడు. ఈ రెండూ కీలక గ్రహాలు. గ్రహాలకు రాకుమారుడు బుధుడు. రాక్షుల గురువు శుక్రుడు. నవంబరులో ఈ రెండు గ్రహాల సంయోగం జరగబోతోంది. దీనివల్ల శక్తివంతమైన రాజయోగం ఐదు సంవత్సరాల తర్వాత ఏర్పడుతోంది. నవంబరులో ఏర్పడే ఈ యోగం వల్ల కొన్ని రాశులవారికి విశేషమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

కన్యా రాశి
మీరు చెప్పే మాటలకు, మాటతీరుకు ఎదుటివారు ఆకర్షితులవుతారు. కొత్తగా కార్యాలయంలో బాధ్యతలు చేపట్టడంతోపాటు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీకు రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు ఆదాయం వస్తుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలను అందుకుంటారు. శివాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాల్లో ఉన్న నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచిది.

three zodiac signs will get huge money due to mercury and venus conjunction from November month

తులా రాశి
జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు కూడా ఇది చాలా మంచి సమయం. మంచి లాభాలను కళ్ల చూస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులు విజయాన్ని సొంతం చేసుకుంటారు. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని అనుభవిస్తారు. వీరికి శుక్రుడి, బుధుడి కలయిక బాగా కలిసివస్తుంది.

మకర రాశి
వీరి ఆదాయం భారీగా పెరుగుతుంది. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. ఎప్పటినుంచో ఉద్యోగం మారాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. ఇది బాగా కలిసివస్తుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వస్తుంది. ఈ రాశివారు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శుక్రుడిని, బుధుడిని పూజిస్తే అనేక శుభాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+