ఈ నెలాఖరు నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగంతోపాటు సువర్ణ యోగం

ఈనెల చివరి వారంలో గ్రహాల రాకుమారుడు బుధుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. త్రికోణ రాశి అయిన కన్యలోకి సంచారం చేయడంవల్ల భద్ర యోగం ఏర్పడుతోంది. ఇది అత్యంత శక్తివంతమైంది. వ్యక్తి జాతకంలో భద్ర యోగం శుభస్థానంలో ఉంటే ఆ జీవితానికి తిరుగులేదు. అదృష్టం కలిసివస్తుంది. జాతకులకు కెరీర్ పరంగా అనేక విజయాలను సాధించడంతోపాటు పూర్తి అదృష్టవంతులుగా మారబోతున్నారు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మేషరాశి
మంచి ఆరోగ్యం కలుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అత్యధిక లాభాలను ఈ నెల చివరి వారంలో పొందబోతున్నారు. పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అందుకు మిత్రులు తోడ్పడతారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు ఈ సమయం కలిసివస్తుంది. ఏ పని తలపెట్టాలన్నా ఈ నెలాఖరులో ప్రారంభిస్తే మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు బాగుంటుంది.

three zodiac signs will get luxury life due to mercury transit virgo

వృషభరాశి
అదృష్టం కలిసివస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి విజయాలు అందుతాయి. అదృష్టం తోడుండటంవల్ల అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం ఉంది. సంపాదన పెరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారికి అదృష్టం తోడవుతుంది. ఆర్థిక లాభాలను పొందుతారు. మతపరమైన పనుల్లో పాల్గొంటారు. ఆలోచనా శక్తి పెరిగి ప్రతి పనిని కూలంకుషంగా పరిశీలించి చేస్తారు. దీనివల్ల ఆ పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.

మీనరాశి
అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగాలు మారాలని ఎదురుచూస్తున్నవారి పనులు ఈ సమయంలో అవుతాయి. కొత్త ఉద్యోగంతోపాటు భారీ వేతనాన్ని అందుకుంటారు. విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బును ఖర్చుచేస్తారు. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఈ సమయంలో కొత్తగా ఒప్పందాలను కుదుర్చుకుంటారు. జీవిత భాగస్వామితో ప్రేమగా గడుపుతారు. సంతోషంగా జీవితం గడుస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి కలిసివస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+