కొత్త ఏడాదికి ముందే ఈ రాశులు కింగ్ మేకర్లు

అత్యంత పవిత్రమైన కార్తీకమాసం మరో రోజులో ముగియబోతోంది. అమావాస్య డిసెంబరు ఒకటో తేదీన వచ్చింది. ఆ రోజు నవగ్రహాల్లో కీలక గ్రహమైన శనీశ్వరుడు కొన్ని రాశులకు మంచిని చేయబోతున్నాడు. నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించే సమయంలో రాశులవారికి గ్రహాలు మంచి ఫలితాలను కలిగిస్తుంటాయి.

కొత్త సంవత్సరం కూడా మరో నెలరోజుల్లో రాబోతోంది. ప్రధానంగా శనీశ్వరుడు కొత్త సంవత్సరానికి ముందే కొన్ని రాశులవారికి కింగ్ మేకర్లుగా మార్చబోతున్నాడు. శనిదేవుడు మనం చేసుకున్న కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ఆయన తలుచుకుంటే రాజు బిచ్చగాడు అవుతాడు.. బిచ్చగాడు రాజు అవుతాడు. అందుకే అన్నీ మంచి పనులే చేయాలి అంటారు. ఏయే రాశులను శనిదేవుడు మహారాజులను చేయబోతున్నాడో తెలుసుకుందాం.

three zodiac signs will get millionaires due to lord shani blessings in december month

కర్కాటకరాశి
అత్తగారి తరఫు నుంచి ఆస్తులు సొంతమవుతాయి. సోదరులతో కొంతకాలం నుంచి నడుస్తున్న ఆస్తి వివాదాలు సమసిపోతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. రాజకీయ రంగంలో రాణిస్తారు. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు ఏర్పడటంవల్ల మీరు లాభపడటంతోపాటు మీవల్ల చాలామంది లాభపడతారు. కర్కాటక రాశివారికి అంతా మంచే జరుగుతుంది.

తులారాశి
ఉద్యోగంలో వేతనం పెరగడంతోపాటు ప్రమోషన్ ఉంది. విదేశీయానికి వెళ్లాలని కలలు కంటున్నవారి కోరికలు ఈ సమయంలోనే నెరవేరతాయి. వారికి ఇది శుభ సమయం అని చెప్పొచ్చు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. కోరిన కోరికలన్నీ నెరవేరతాయి. అందుకు అదృష్టం తోడుంటుంది.

వృషభరాశి
కోర్టుకు సంబంధించిన కేసుల్లో విజయాలు సాధిస్తారు. ప్రభుత్వం ఉద్యోగం రావడంతో ఎప్పటినుంచో కలలు కంటున్న సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులందరి మధ్య అనుబంధం బలపడుతుంది. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు అందరూ కలిసి తీసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+