పూర్వాభాద్రలోకి శుక్రుడు... ఈ రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంది
సంపదకు, విలాసవంతమైన జీవితానికి, ఆనందానికి, అందానికి, ఐశ్వర్యానికి కారణమైన శుక్రుడు నక్షత్రాన్ని మార్చి పూర్వాభాద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. దీనివల్ల అన్ని రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ మూడు రాశులవారు మాత్రం మంచి ప్రయోజనాలను అందుకుంటున్నారు. ఈనెల 17వ తేదీన శుక్రుడు పూర్వాభాద్రలోకి సంచారం చేస్తారు. అప్పటి నుంచి నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. రాశులను మార్చినప్పుడే కాకుండా నక్షత్రాన్ని మార్చినప్పుడు కూడా శుక్రుడు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాడు. ఏయే రాశులకు అదృష్టం బంకలా పట్టుకుందో తెలుసుకుందాం.
మకరం
ఈ రాశివారికి ఈ సమయంలో ఆదాయం భారీగా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులు మాత్రం విజయాలను అందుకుంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో అంటే ఫిబ్రవరి ఒకటోతేదీలోగా పూర్తిచేస్తారు. అన్నిరంగాల్లో ఉన్నవారికి సానుకూల ఫలితాలున్నాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ రాశివారు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శుక్రుడిని పూజించాలి.

కుంభం
కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. దాంపత్య జీవితం చాలా అనుకూలంగా సాగుతుంది. ఒకరి మాటకు మరొకరు విలువ ఇచ్చుకుంటారు. ప్రేమలో ఉన్నవారికి అడ్డంకులు ఏర్పడవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి కలుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక లాభాలున్నాయి. వచ్చిన డబ్బును మీరు ఎలా చూసుకుంటారనేదానిపై మీ భవిష్యత్తు ఆధారపడివుంటుంది.
వృశ్చికం
వీరు ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుండి అవన్నీ సకాలంలో పూర్తవుతాయి. వీటివల్ల ధనలాభం ఉంది. వచ్చిన డబ్బును విలాసాలకు కాకుండా భవిష్యత్తులో రాబడినిచ్చేలా పెట్టుబడులు పెట్టకపోతే తీవ్రంగా నష్టపోతారు. అది మీ చేతుల్లోనే ఉంది. వ్యాపారస్తులకు సమయం బాగుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డబ్బుల గురించి వీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నవగ్రహాలకు ప్రదక్షిన చేసి శుక్రుడిని పూజించాలి. అంతా శుభమే జరుగుతుంది.












Click it and Unblock the Notifications