శనీశ్వరుడి ప్రభంజనం... ఈ రాశులకు అద్భుత ధనయోగం

నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు కర్మ ప్రదాత. కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తుంటాడు. అత్యంత శక్తివంతమైన శనిదేవుడు ప్రసన్నమైతే చింకి గుడ్డలు వేసుకొని తిరిగి కటిక పేదవాడు కూడా మహారాజు అవుతాడు. కానీ న్యాయం, నీతి, నిజాయితీకి పట్టం కడితేనే ఇవన్నీ లభిస్తాయి. అందుకే శనిదేవుడిని న్యాయదేవత అంటారు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రాశిని మారుస్తుంటాడు. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం కూడా శని. కొన్ని సంవత్సరాల తర్వాత శనిదేవుడు కొన్ని రాశులపై చల్లని చూపును ప్రసరించబోతున్నాడు. దీనివల్ల వారు పొందే లాభాలు అనంతం. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.

కర్కాటక రాశి
స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎప్పటినుంచో ఉన్న న్యాయ సంబంధిత వివాదాల్లో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడి అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒకర్నొకరు సహాయం చేసుకుంటారు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాల్లో బయటి వ్యక్తులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండటం, లేదంటే అవసరమై మేర మాట్లాడటం మీకు మేలు చేస్తుంది. లేదంటే వివాదాలు చాలా పెద్దవి అవుతాయి.

three zodiac signs will get more money due to Saturn effect after somany years

సింహ రాశి
ఈ రాశివారు స్తిరాస్థి రంగంలో బాగా రాణిస్తారు. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. అనుకున్న పనులన్నీ సులువుగా పూర్తిచేస్తారు. అనుకోకుండా వీరికి లాటరీ తగిలే అవకాశం ఉంది. దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వచ్చిన డబ్బును తిరిగి రెట్టింపు చేసేలా పెట్టుబడి పెట్టడంలోనే మీ విజయం దాగివుంది. లేదంటే గతంలోలానే ఆర్థిక పరిస్థితి మారుతుంది. పెద్దల సలహా తీసుకొని ఆ ప్రకారం పెట్టుబడులను పెట్టాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలి.

మిథున రాశి
కొన్నాళ్ల నుంచి విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నవారి కోరికలు ఈ సమయంలోనే నెరవేరతాయి. వారికి విదేశీ అవకాశాలు తలుపు తడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. గతంలో నిలిచిపోయి ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అలాగే డబ్బును దుబారా చేయకుండా పొదుపు చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+