అంగారక యోగం.. ఈ రాశులకు అంతులేని ధనలాభం
ఖగోళంలో రాహువు, కేతువు అంటే నీడ గ్రహాలని పేరు. ఈ గ్రహాలంటే అందరూ భయపడుతుంటారుకానీ మనం మంచి పనులు చేస్తుంటే వారే మనకు మంచి ఫలితాలను ప్రసాదిస్తుంటారు. కేతువు మే 18వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించాడు. 2026 డిసెంబరు 5వ తేదీ వరకు అదే రాశిలో సంచారం చేస్తాడు. అలాగే ఈ నెల 7వ తేదీన కుజుడు సింహరాశిలోకి రాబోతున్నాడు.
ఏడో తేదీ నుంచి కుజుడు, కేతువు కలిసి సంచరించడంవల్ల అంగారక యోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశిచక్ర గుర్తులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఆధ్యాత్మికతవైపు ఎక్కువగా మొగ్గుచూపుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏయే రాశులకు ఏ విధంగా అంగారక యోగం ప్రయోజనాలు కల్పిస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మిథున రాశి
ఆధ్యాత్మికతవైపు ఎక్కువగా మొగ్గుచూపుతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల పనులన్నీ చాలా సులువుగా పూర్తిచేయగులుగుతారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో గట్టిగా కృషిచేస్తారు. ఆధ్యాత్మికంగా అనేక ఆనందాలు, అనుభూతులు కలుగుతాయి. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేస్తారు.
ధనుస్సు రాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఈ రాశివారు కూడా ఆధ్యాత్మికతవైపు ఎక్కువగా మొగ్గుచూపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఒత్తిడి నుంచి బయటపడటానికి ప్రాణాయామం చేస్తారు. జీవితంలో సంతోషం అనుభవిస్తారు. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నవారు వేరే సంస్థల్లోకి వెళ్లే అవకాశం ఉంది. దీనికి కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. పిల్లల నుంచి అనేక శుభవార్తలను అందుకొని సంతోషిస్తారు.
సింహరాశి
ఈ రాశివారికి సమాజంలో గౌరవం కలుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమైనవారు, ఇప్పటికే పరీక్షలు రాసినవారికి ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న కలహాలన్నీ దూరమవుతాయి. అందరూ కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. డబ్బుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.












Click it and Unblock the Notifications