తులా రాశిలోకి చంద్రుడు... ఈ రాశులకు అదృష్టం వరించి సంపద పెరుగుతుంది

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేసే సమయంలో కొన్ని రాశి చక్ర గుర్తులకు మంచి ఫలితాలు, మరికొన్ని రాశిచక్ర గుర్తులకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంటాయి. ప్రేమకు, అందానికి, విలాసాలకు కారకుడైన చంద్రుడు ఈనెల ఆరోతేదీ వరకు తులా రాశిలో ఉంటాడు. దీనికి అధిపతి రాక్షసుల గురువైన శుక్రుడు. నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ సాయంత్రం వరకు తులా రాశిలో చంద్రుడు ఉండటంవల్ల కొన్ని రాశులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి.

మకర రాశి
దాంపత్య జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా జీవిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి లాభాన్ని ఆర్జిస్తారు. పెళ్లి కానివారు, ప్రేమలో ఉన్నవారు తాము ఇష్టపడేవారికి విషయం చెప్పడం ఎంతో ఉత్తమం. ఆలస్యమయ్యే కొద్దీ నష్టం జరుగుతుంది. ఈ రాశివారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి.

three zodiac signs will get small and big benefits and huge money due to moon will enter tula rashi

వృశ్చిక రాశి
ఈ రాశివారి జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగస్థులకు వారి పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకుంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన అవసరంలేదు. ఎందుకంటే వారి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. చంద్రుడి సంచారం ఇంకా వీరికి ఊహించని లాభాలను కలిగించబోతోంది.

తులా రాశి
మంచి శుభ ఫలితాలను అందుకుంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారి జీవితం ఎంతో మధురంగా, ఆనందంగా గడుస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారు ఎంతో అన్యోన్యంగా జీవిస్తారు. ఒకరి మాటకు మరొకరు విలువ ఇస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఊహించనిరీతిలో హఠాత్తుగా లాభాలు వస్తాయి. శుభవార్తలను అందుకుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+