బుధుడి తిరోగమనంతో ఈ రాశులకు దశ, దిశ తిరుగుతోంది.. మహర్జాతకులవుతారు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే సమయంలో మంచి ఫలితాలను, మిశ్రమ ఫలితాలను ప్రసాదిస్తుంటాయి. తెలివితేటలకు, తర్కానికి, స్నేహానికి, ఎదుటివారితో మాట్లాడే కళకు కారకుడైన గ్రహాల రాకుమారుడు బుధుడు వచ్చే నెల 18వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించి తిరోగమనదిశలో సంచారం చేస్తాడు. దీనివల్ల ఏయే రాశులకు మేలు కలుగుతుంది? ఎలా కలిసివస్తుంది? తదితర వివరాలను తెలుసుకుందాం.
సింహ రాశి
వీరికి జీవితంలో అనేక సౌకర్యాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కలగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. వారంతా తీర్థయాత్రలకు వెళతారు. అందరి మధ్య అనుబంధం వెల్లివిరుస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలతో చర్చించి నిర్ణయించుకోవాలి.

మిథున రాశి
ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారికి కూడా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వచ్చిన అవకాశాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. లేదంటే నష్టపోతారు. వాటిని వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు వారు కోరుకున్న రీతిలోనే లాభాలను కళ్లచూస్తారు. పనిచేసే సమయంలో ఒత్తిడికి గురైతే అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఒత్తిడి అనిపించినప్పుడు పనిని ఆపేసి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. ఇంటివరకు పనిని తీసుకువెళ్లకండి.
కన్యా రాశి
ఆకస్మికంగా వీరికి ఆర్థిక లాభాలున్నాయి. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి.












Click it and Unblock the Notifications