సంసప్తక రాజయోగంతో రాశులవారిపై బంగారు నాణాలు పోస్తున్న సూర్యుడు, కుజుడు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటుంది. ఇలా చేసే క్రమంలో కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి. సంచారం చేసేందుకు ఒక్కో గ్రహానికి ఒక్కో సమయం ఉంటుంది. సూర్యుడు నెలకో రాశిని మారిస్తే, శనిదేవుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మారుస్తుంటాడు. ప్రస్తుతం మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించివున్నాడు. ఈ గ్రహానికి ఎదురుగా కుజుడు సంచారం చేస్తున్నాడు. ఎదురెదురు రాశుల్లో ఈ రెండు గ్రహాలు సంచారం చేస్తున్న సమయంలో ఎంతో శక్తివంతమైన సంసప్తక రాజయోగం ఏర్పడింది. దీనివల్ల ఏయే రాశులవారు ప్రభావితులవుతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కనపరుస్తారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి అనుకూలంగా నిర్ణయాలు వస్తాయి. ప్రేమలో ఉన్నవారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయివేటు రంగంలో ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. మానసికంగా ఎంతో ప్రశాంతంగా జీవిస్తారు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. మతపరమైన కార్యక్రమాల్లో ఎంతో ఆసక్తిగా పాల్గొంటారు. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

ధనుస్సు రాశి
వ్యాపారస్తులకు ఈ సమయం బాగుంటుంది. వ్యాపారంలో ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి పెద్ద పెద్ద పదవులు లభించే సమయం ఇది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు అనుకోని రీతిలో మంచి ప్రయోజనాలను పొందబోతున్నారు. వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారి పనులు సఫలీకృతమవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో అందరి ఆరోగ్యం బాగుంటుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కన్యారాశి
వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి పనినైనా పూర్తిచేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుంటారు. వ్యాపారస్తులు కొత్తగా వ్యాపారాలను ప్రారంభించడంతోపాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. వీరికి డబ్బు బాగా వస్తుందికానీ అనవసరమైన వాదనలకు వెళ్లకుండా, తర్కించకుండా ఉండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోతారు. ప్రేమలో ఉన్న జంట మంచి ప్రయోజనాలను పొందుతారు. కన్యారాశివారికి అద్భుతమైన సమయం ప్రారంభమైందని పండితులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications