ఈ రాశుల అఖండ ధనయోగానికి హామీ ఇస్తున్న శని, రాహువు
రాహువు మంచి ఫలితాలనివ్వదని, అన్నీ చెడు ఫలితాలే కలుగుతాయని నమ్మకం. కానీ రాహువు తలుచుకుంటే కనక వర్షం కురిపించగలగడు. అలాగే శనిదేవుడన్నా అందరికీ భయమే. కానీ వారు చేసే మంచి మాత్రం ఊహకు అందని విధంగా ఉంటుంది. వచ్చే ఏడాది శనిదేవుడు శతభిషా నక్షత్రంలో, రాహువు ఉత్తర భాద్రపద నక్షత్రంలో సంచారం చేస్తుంటారు. ఈ ప్రభావం అన్ని రాశిచక్రాలపై ఉంటుంది. కొన్ని రాశులవారికి అద్భుతమైన ఫలితాలున్నాయి. జీవితం కూడా మారిపోతుంది. ఏయే రాశులవారికి ఏవిధంగా రాహువు, శని లాభాలను ప్రసాదిస్తున్నారో తెలుసుకుందాం.
వృషభ రాశి
సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లడంవల్ల పనులన్నీ పూర్తవుతాయి. ఇవి పూర్తయితే ఆర్థిక లాభాలు కలగడంతోపాటు అనేక లాభాలున్నాయి. అలాగే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. వీటిని సద్వినియోగం చేసుకొని మంచిగా పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో అద్భుతమైన రాబడులను అందిస్తాయి. ఎటువంటి సమస్యనైనా సులువుగా పరిష్కరింపచేసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు బాగుంటుంది.

మిథున రాశి
శని, రాహువు నక్షత్ర సంచారం మిథునరాశివారికి ఎంతో శుభప్రదం. ఏ పని తలపెట్టినా సులభంగా విజయాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే మెరుగుపడతాయి. విదేశీ ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారాలన్నీ లాభాలబాటలో ఉంటాయి. భాగస్వాముల మధ్య మంచి సంబంధాలుండటంతోపాటు ఒప్పందాలు జరుగుతాయి. దీనివల్ల గతం నుంచి వేధిస్తున్న మానసిక సమస్యలు దూరమవుతాయి.
మేష రాశి
వచ్చే ఏడాది మొత్తం వీరికి చాలా బాగుంటుంది. కెరీర్ కు సంబంధించి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అవి మంచి ఫలితాలను కలిగిస్తాయి. చేసే పనుల్లో విపరీతమైన లాభాలున్నాయి. సంపాదన పెరుగుతుంది. కుటుంబ జీవితంలో కొన్నాళ్ల నుంచి వస్తున్న సమస్యలు తొలగిపోతాయి. దీనివల్ల శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి.












Click it and Unblock the Notifications