ఈ రాశుల్లో బిచ్చగాడు కూడా 2025లో కోటీశ్వరుడవుతున్నాడు
ఖగోళంలో నిరంతరం జరుగుతున్న గ్రహాల కదలికలు మానవుల వ్యక్తిగత జీవితంతోపాటు సమాజ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దేవతలకు గురువైన బృహస్పతి ఆశీస్సులు ఉంటే ద్వాదశ రాశులకు తిరుగుండదు. సంపదను, ఐశ్వర్యాన్ని, ఆధ్యాత్మికతను ప్రసాదించే గురుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడానికి ఏడాది సమయం తీసుకుంటాడు. సంతానాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించే గురుడు 2024 మే 1వ తేదీన మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశించాడు. 2025లో తిరిగి తన రాశిని మార్చుకోబోతున్నాడు. బిచ్చగాడిని కూడా కోటీశ్వరుడిని చేయగలిగే బృహస్పతి రాశి సంచారంవల్ల ఏయే రాశులకు సంపద కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
సింహరాశి
ఈ రాశి 10వ ఇంట్లో గురుడు తిరోగమన దిశలో ఉన్నాడు. దీనివల్ల ప్రధానంగా వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. కోరుకున్నచోటకు బదిలీ చేయించుకోగలుగుతారు. ఆర్థికంగా కలిసివస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అయితే నిర్ణయాలు తీసుకునే సమయంలో తడబడకూడదు. కుటుంబ సభ్యులతో చర్చించి అందరూ ఒకమాటమీద నిర్ణయం తీసుకోవాలి. అలాంటివి భవిష్యత్తులో బాగా కలిసివస్తాయి.

వృషభ రాశి
ఈ రాశివారి మొదటి ఇంట్లోనే బృహస్పతి తిరోగమనంలో సంచారం చేస్తున్నాడు. దాంపత్య జీవితం దీనివల్ల చాలా బాగుంటుంది. ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలను పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని రెట్టింపు రూపంలో పొందుతారు. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు. నవగ్రహాలకు ప్రదక్షిన చేయడంతోపాటు బృహస్పతికి పూజ చేయించాలి. గురువారం సాయిబాబా, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తిలను సందర్శించాలి.
కర్కాటకరాశి
ఈ రాశి 11వ ఇంట్లో బృహస్పతి సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఈ రాశివారికి ఆదాయం భారీగా పెరుగుతుంది. అదనపు ఆదాయానికి మార్గాలు కూడా తోడవుతాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. సంపాదించిన డబ్బును పొదుపు చేస్తారు. బవిష్యత్తులో రాబడినిచ్చేలా పొదుపు చేయాలి. లేదంటే నష్టపోతారు. దీనికి ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోండి. ఎదుటివారితే మాట్లాడే విషయంలో ఈ రాశివారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మాట తీరు చేటు తెచ్చే అవకాశం కనపడుతోంది.












Click it and Unblock the Notifications