మహా శివరాత్రి తర్వాత నుంచి ఈ రాశుల తలరాత మారిపోతోంది

దేశవ్యాప్తంగా మహాశివరాత్రిని ఎంతో వైభవంగా, కన్నుల పండువగా జరుపుకుంటున్నారు. భోళాశంకరుడు, భక్త సులభ వల్లభుడు అయిన పరమేశ్వరుడిని ఏది కోరితే అది ఇచ్చేస్తాడు. మాఘమాసంలో వచ్చే 14వ రోజును శివరాత్రిగా జరుపుకుంటాం. ఈరోజు దాదాపు 100 సంవత్సరాల తర్వాత శక్తివంతమైన మాలవ్య రాజయోగం, శశ రాజయోగం ఏర్పడుతున్నాయి. దీనివల్ల కొన్ని రాశులవారి ఆదాయం రెట్టింపు అవడంతోపాటు వారి ఆర్థిక పరిస్థితులు కూడా మారిపోతాయి. అదృష్టాన్ని పొందే రాశుల వివరాలను తెలుసుకుందాం.

కుంభరాశి
శశ రాజయోగం, మాలవ్య రాజయోగంతో ఈ రాశివారి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఉద్యోగస్థులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. అనేకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారంతా ఈ రెండు యోగాలతో వాటినుంచి విముక్తిని పొందుతారు. దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి.

three zodiac signs will solve their problems and get huge money due to sasha and malavya rajayogams

మిథున రాశి
ప్రధానంగా సమాచార సంబంధమైన రంగాల్లో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. వ్యాపారస్తులకు మంచి పురోగతితోపాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. అనుకున్న పనుల్లో విజయం సాధించడానికి అదృష్టం తోడుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శివాలయాన్ని తరుచుగా దర్శించుకుంటుండాలి.

మకర రాశి
ఈ రెండు రాజయోగాలవల్ల ఈ రాశివారి జీవితంలో అన్నీ సానుకూల పరిణామాలే ఎదురవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు. దీనివల్ల వారు బ్రహ్మాండమైన లాభాలను పొందుతారు. అంతేకాదు.. గతంలో ఇచ్చి ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి చేతికి అందుతాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+