మహాలక్ష్మీ రాజయోగంతో ఈ రాశులకు దరిద్రంలా పట్టుకుంటున్న అదృష్టం
గ్రహాలు నిరంతరం రాశి సంచారం చేస్తుంటాయి. అందుకు ఒక్కో గ్రహం ఒక్కో సమయం తీసుకుంటుంది. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు మంచి పరిణామాలు, మరికొన్ని రాశులకు వారి కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాయి. మనసుకు కారకుడైన చంద్రుడు నిరంతరం రాశి సంచారం చేస్తుంటాడు. జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు, కుజుడు కలిస్తే అది మంచి కలయికగా పరిగణిస్తారు పండితులు. దీనివల్ల మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఏయే రాశులకు ఆర్థికంగా మంచి లాభాలున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని విజయవంతం చేయగలుగుతారు. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉంటారు. వీరికి శ్రేయస్సు కూడా సమకూరుతుంది. పెద్దల అనారోగ్యం విషయంలో ఆందోళన అవసరం లేదు. తగ్గుతాయి. అలాగే అందరూ కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. అత్త, మామల నుంచి మద్దతు లభించి అనేక ఆర్థిక లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది.

కుంభరాశి
కుంభరాశివారికి చంద్రుడు, కుజుడి కలయిక అద్భుతంగా కలిసివస్తుంది. అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాల వైపు మనసు మొగ్గుతుంది. పాజిటివ్ గా ఆలోచించి సానుకూల శక్తితో ముందుకు పయనిస్తారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో మీ మాటతీరు బాగుండాలి. అదే మీకు విజయాన్ని కట్టబెడుతుంది.
కన్యారాశి
ఉద్యోగస్థులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతులున్నాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు బలపడతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమలో దీర్ఘకాలికంగా ఉన్నవారు తమ సంబంధాలను వివాహం దిశగా తీసుకువెళతారు. ఇరువైపులా పెద్దలు అంగీకరిస్తారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.












Click it and Unblock the Notifications