Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Today Rasi Phalalu : శనిదేవుని అనుగ్రహం..ఈ రాశుల వారి పంట పండబోతుంది

మేష రాశి (Aries)
ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పనులను పూర్తి చేయడంలో కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ విజయం సాధిస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేసుకుంటారు.పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

వృషభ రాశి (Taurus)
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలమైన రోజు.ఉద్యోగస్తులకు పదోన్నతికి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. కొత్త భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల బాధ తగ్గుతుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

Today Rashi Phalalu Jyotishyam Zodiac Predictions in Telugu for Saturday November 8th 2025

మిథున రాశి (Gemini)
ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. పనులను పూర్తి చేయడంలో కొంత ఆలస్యం, చిరాకులు ఎదురయ్యే అవకాశం ఉంది.పనిలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు వద్దు.మాటను అదుపులో ఉంచుకోవడం మంచిది. బంధువులతో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి.

కర్కాటక రాశి (Cancer)
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ మానసిక ఆలోచనలు బలపడతాయి.పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు.ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది. పెట్టుబడులకు అనుకూలం.జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

సింహ రాశి (Leo)
ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి. ముఖ్యమైన విషయాలపై లోతైన ఆలోచన అవసరం.కార్యాలయంలో మీ మంచి పనితీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో పెద్ద సమస్యను పరిష్కరిస్తారు.

కన్యా రాశి (Virgo)
సాధారణం: ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కొన్ని చికాకులు కలుగుతాయి, కానీ రోజు చివర్లో ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల సమయం. మీ పనులలో ఇతరుల సహాయం తీసుకోవాల్సి రావొచ్చు.ఆర్థికంగా కలిసొస్తుంది. కోరికలు నెరవేరుతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

తులా రాశి (Libra)
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి.ప్రయాణాలు చేసేవారికి ఈ రోజు శుభంగా ఉంటుంది. మీ ప్రశాంతమైన వైఖరితో కెరీర్‌లో మెరుగైన ఫలితాలు పొందుతారు.అవసరాలకు మించి డబ్బు ఖర్చు చేయకుండా ఉండటం మంచిది. పొదుపుపై దృష్టి పెట్టాలి. మీ మాటలను అదుపులో ఉంచుకోండి, లేదంటే సంబంధాలలో చీలిక రావచ్చు. పెద్ద వ్యక్తిని కలవడం లాభదాయకం.

వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు మీకు చాలా మంచిగా ఉంటుంది. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు.వ్యాపారాన్ని కొత్త ప్రదేశానికి మార్చడానికి లేదా విస్తరించడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీరు కోరుకున్న ఆర్థిక ఫలితాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారానికి సమయం అనుకూలం.మీ మనస్సు ఒడిదుడుకులతో నిండి ఉండొచ్చు. సహోద్యోగులు, కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండాలి.

ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి.కొత్త ప్రణాళికలను ప్రారంభించడానికి సమయం లభిస్తుంది. వ్యాపారంలో విజయం సాధించడానికి అవకాశం ఉంది.ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు.ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇంట శుభకార్యాలకు ప్రయత్నాలు జరుగుతాయి.

మకర రాశి (Capricorn)
ఈ రోజు క‌లిసి వ‌చ్చే స‌మ‌యం. బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి.ఉద్యోగంలో ప‌ద‌వీ బాధ్య‌త‌లు పెరుగుతాయి. వ్యాపారంలో విజ‌యాలు అందుకుంటారు. రాజకీయ నాయకులు నూతన పార్టీల్లో చేరే అవకాశం ఉంది.ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.సుఖశాంతులకు లోటు ఉండదు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి.

కుంభ రాశి (Aquarius)
ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పనులన్నిటినీ జాగ్రత్తగా చేయాలి. సహనం కోల్పోకుండా ఉండాలి. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.పెరిగిన కుటుంబ ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించాలి.స్నేహితులు, కుటుంబ సభ్యులతో సహకరించాల్సి రావొచ్చు. సంబంధాలలో మెరుగుదల ఉంటుంది.

మీన రాశి (Pisces)
ఈ రోజు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది.ఊహించని లాభాలు, అదృష్టం కలిసొస్తాయి.కుటుంబం, స్నేహితుల మధ్య సానుభూతి, సహకారం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+