కనక వర్షం కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్స్

అతి తక్కువ సమయంలోనే రెట్టింపునకు పైగా రిటర్న్స్ ఇచ్చేవాటిని మల్టీబ్యాగర్ స్టాక్స్ అని పిలుస్తారు. ఇటీవలి కాలంలో ఈ ఐదు కంపెనీలకు చెందిన మల్టీబ్యాగర్ స్టాక్స్ లో డబ్బులు రెట్టింపయ్యాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. నిఫ్టీ 19,800 పాయింట్లు, సెన్సెక్స్ 66,500 దాటాయి. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు మంచి ప్రతిఫలాన్ని అందిస్తున్నాయి.

* Olectra Greentech: ఎలక్ట్రికల్ బస్సులు, పాలిమర్ ఇన్సులేటర్లను ఈ కంపెనీ తయారు చేస్తుంది. సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పెట్టుబడిదారులకు 141% రాబడిని ఇచ్చి మల్టీ బ్యాగర్ స్టాక్ గా మారింది. ఈ సంస్థ షేరు శుక్రవారం రూ.1,248 వద్ద ముగిసింది.

top 5 multibagger stocks details

* Mazagon Dock Shipbuilders: మజగాన్ డాక్‌షిప్ బిల్డర్స్ కంపెనీలో ప్రభుత్వానికి 84% వాటా ఉంది. ఈ ఏడాది పెట్టుబడిదారులకు 181% రాబడిని అందించింది. సంవత్సర కాలంలో చూస్తే 400% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. ఈ సంస్థ షేరు శుక్రవారం రూ.2,219 వద్ద ముగిసింది.

* JBM Auto: ఆటో సిస్టమ్స్, బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థ. ఈ కంపెనీ షేర్లు ఇప్పటివరకు పెట్టుబడిపై 188% రాబడినిచ్చాయి. శుక్రవారం గరిష్టంగా రూ. 1,503ని తాకింది. గత ఆరు నెలల్లో ఈ కంపెనీ షేర్ల ధరలు 140% చొప్పున పైకెగశాయి.

* Suzlon Energy: రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ అయిన సుజ్లాన్ ఎనర్జీ ప్రొవైడర్ గత మూడు సంవత్సరాల్లో 600% పెరిగింది. ఏడాదిలో 172% పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు గ్రీన్ ఎనర్జీ స్టాక్ 124% లాభపడింది. శుక్రవారం రూ.24.12 దగ్గర ముగిసింది.

* Apar Industries: ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం, అల్లాయ్ కండక్టర్ తయారీ సంస్థ అపార్ ఇండస్ట్రీస్. ఇన్వెస్టర్లకు 166% రాబడిని ఇచ్చింది. ఈ కంపెనీ షేర్ల ధరలు ఈ సంవత్సరంలో మూడు రెట్లు పెరిగాయి. శుక్రవారం ఈ షేరుధర రూ.4,866 వద్ద ముగిసింది.

పైన పేర్కొన్న కంపెనీల స్టాక్స్ అన్నీ మల్టీబ్యాగర్ స్టాక్స్ అయ్యాయి. వీటిని రికమండేషన్స్ స్టాక్ గా భావించకూడదు. ఎవరైనా స్టాక్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే సెబీ అడ్వైజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ను అడిగి సలహా తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+