100 ఏళ్ల తర్వాత అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం..ఈ రాశుల వారి దశ తిరిగినట్టే
సంపూర్ణ చంద్రగ్రహణం ఒక ఖగోళ దృగ్విషయం. ఇది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పివేస్తుంది.సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు లేదా నారింజ రంగులోకి మారతాడు. జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంపూర్ణ చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పడం. దీని వల్ల చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడు.
దీన్నే "బ్లడ్ మూన్" అని పిలుస్తారు.చంద్రగ్రహణం సమయంలో రాశులలో మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి. తాజాగా ఏర్పడే చంద్రగ్రహణానికి చాలా విశిష్టత ఉంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇలాంటి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. 100 సంవత్సరాల తర్వాత హోలీ పండుగ రోజున ఏర్పడుతున్న సంపూర్ణ చంద్రగ్రహణం. దీంతో జ్యోతిష్యశాస్త్రంలో కీలక మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. పలు రాశుల వారిపై ఈ చంద్రగ్రహణం ప్రభావం పడనుంది. ఆ రాశులు ఏవో ఓ సారి పరిశీలిద్దాం.

సింహ రాశి
100 ఏళ్ల తర్వాత ఏర్పడే చంద్రగ్రహణం సింహ రాశి వారిపై ప్రభావం చూపించనుంది. కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాల్లో కుటుంబ సభ్యులు చిక్కుకునే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.
మకర రాశి
మకర రాశి వారిపై కూడా ఈ చంద్రగ్రహణం ప్రభావం చూపించనుంది. విద్యార్థులకు అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యంపై దృష్టి సారించడం మంచిది.
తులా రాశి
100 ఏళ్ల తర్వాత వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం తులా రాశి వారిపై ప్రతికూలంగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఆరోగ్యపరంగా కూడా వీరికి సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉందని వేద పండితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications