దీపావళికి ముందే ఈ రాశులకు అఖండ ధనయోగాన్నిస్తున్న శుక్రుడు

ఈనెల 12వ తేదీన విజయదశమి జరుపుకుంటాం. ఆ తర్వాతరోజు సంపదకు కారకుడయ్యే శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. శుక్రుడు ఎప్పుడూ నిర్దిష్ట సమయంలోనే తన రాశిని మారుస్తుంటాడు. ఇలా మార్చే క్రమంలోనే అన్ని రాశులకు శుభ ప్రయోజనాలు ఇస్తున్నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం అతి తక్కువ ప్రయోజనాలే అందుతాయి. శుక్రుడి సంచారం వల్ల ఎక్కువగా లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

సింహ రాశి
వ్యాపారస్తులు బాగా ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి శుభవార్తలు అందుతాయి. పెద్దల ఆస్తులకు సంబంధించిన వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి ప్రయత్నాలు ఈ సమయంలోనే విజయవంతమవుతాయి. వాహనాన్ని లేదంటే ఆస్తిని కొనుగోలు చేస్తారు.

Transit of Venus in Scorpio brings many money benefits and good health to five zodiac signs

మకర రాశి
అనుకున్న పనులన్నీ నెరవేరతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం కొంతకాలం నుంచి ఎదురుచూస్తున్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. పనిచేసేచోట పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ జీవితంలో విజయాన్ని అందుకుంటారు.

వృషభ రాశి
వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతం కావడమే కాకుండా ప్రశంసలు కూడా కురిపిస్తాయి. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నవారికి ఇది అనుకూలంగా ఉండే సమయం. వృత్తిలో ఉన్నవారితోపాటు ఇప్పటికే వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంది. న్యాయపరమైన కేసుల్లో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి
ప్రేమించుకుంటున్నవారికి శుభ సమయం అని చెప్పొచ్చు. వారు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగస్తులకు సహాయ సహకారాలు అందుతాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు రాణిస్తారు. వ్యాపారంలో ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. చిన్న చిన్న విభేదాలన్నీ సమసిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది.

వృశ్చిక రాశి
శుక్రుడి సంచారం ఈ రాశిలో జరగనుండటంతో వీరికి బాగా కలిసివస్తుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొత్తగా వివాహమైనవారికి సంతాన యోగం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే దీపావళి పండగు వీరికి ముందుగానే వచ్చినట్లు లెక్క. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని పనుల విషయాల్లో ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+