మీకు కుడికన్ను అదురుతోందా? ఎడమకన్ను అదురుతోందా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం ఇప్పటికీ మూఢ నమ్మకాలను, కొన్ని శకునాలను నమ్ముతుంటాం.
కొన్నిసార్లు మనుషుల ఎడమ కన్ను అదిరితే..మరికొన్నిసార్లు కుడి కన్ను అదురుతుంటుంది. పురుషులకు ఎడమ, కుడి కన్ను.. ఆడవారి ఎడమ, కుడి కన్ను అదరడం వల్ల ఏం జరుగుతుంది? మంచా? చెడా ? తెలుసుకుందాం.
కుడి కన్ను కొట్టుకుంటే ఏమవుతుంది?
ఎడమ కన్ను కొట్టుకుంటే ఏమవుతుంది?. పిల్లి ఎదురొస్తే మంచిది కాదని, కుక్కలు మొరిగితే మంచిది కాదని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. అయితే వీటిల్లో మనం చేయబోయే పనులకు సంబంధించిన ఫలితాలు కూడా ఆధారపడివుంటాయని విశ్వసిస్తారు. అయితే మన ప్రమేయం లేకుండా అప్పుడప్పుడు కన్ను దానంతట అదే అదురుతుంటుంది. మగవారికి ఎడమ కన్ను, కుడికన్ను అదరడం వల్ల ఏం జరుగుతుంది? ఆడవారికి ఎడమకన్ను, కుడికన్ను అదరడంవల్ల ఏం జరుగుతుందో ఇప్పుడే తెలుసుకుందాం.
పురుషులకు ఎడమ కన్ను కొట్టుకుంటే దరిద్రం వెంటాడుతుందని సూచన ఇస్తుందనే నమ్మకం ఉంది. కుడి కన్ను అదిరితే అతని చిరకాల కోరిక నెరవేరుతుందని..తనకు ఇష్టమైన వారిని కలవడం లేదంటే ఏదైనా అదృష్టం కలిసి రావడం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇక మహిళల కుడి కన్ను కొట్టుకుంటే అరిష్టంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని పూర్వకాలం నుంచి చెబుతుండేవారు.

మన దగ్గర ఉన్న నమ్మకాలను బట్టి అది అధారపడివుంటుంది. మంచి, చెడులను తెలియజేయడానికి కున్ను కొట్టుకుంటోందా? లేదంటే శరీరంలో ఏదైనా సమస్యవల్లా అనేది కూడా మనం తెలుసుకోవాలి. చైనా కంటి శాస్త్ర ప్రకారం ఎడమ కన్ను అదిరితే గొప్ప వ్యక్తి ఇంటికొస్తారని, కుడికన్ను అదిరితే పార్టీకి ఆహ్వానం లభిస్తుందని భావిస్తారు. అర్థరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు కన్ను అదిరితే కంగారు పడేపనేదో జరుగుతుందని, కుడికన్ను అదిరితే ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నారని, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల మధ్య సమయంలో అదిరితే అనుకున్న పనులు పూర్తికావడంతోపాటు చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయనే నమ్మకం ఉంది.
మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్యలో ఎడమకన్ను అదిరితే త్వరలోనే కొంత ధనం కోల్పోతామని అర్థం. అంతేకాదు.. విదేశాల నుంచి అతిథులు వస్తారని, కుడి కన్ను అదిరితే మీరు ప్రేమిస్తున్నవారి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట లోపు కన్ను అదిరితే గొప్ప వ్యక్తిని కలుస్తారనే లెక్కలు చైనావారికి బాగుగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications