2025లో ఈ రాశులపై బృహస్పతి అపార దయ.. అఖండ ధనయోగం

ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తుంటాయి. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించేందుకు ఒక్కో గ్రహం ఒక్కో సమయాన్ని తీసుకుంటుంది. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు సానుకూల పరిణామాలు ఎదురైతే, మరికొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. వ్యక్తి జాతకంలో దేవ గురువైన బృహస్పతి శుభ స్థానంలో ఉంటే వారికి తిరుగుండదు. అన్నివిధాలుగా కలిసివస్తుంది. ఉద్యోగం, చదువుతోపాటు జీవితానికి సంబంధించి కీలక పాత్ర పోషిస్తాడు. మిథునరాశిలోకి ప్రవేశించిన బృహస్పతి ఏడాది సమయం ఉండబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారు కోటీశ్వరులు కాబోతున్నారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతున్నారు. జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే వారిని ఆపడం ఎవరివల్లా కాదు. ఏయే రాశులవారికి ఏవిధంగా బృహస్పతివల్ల కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

ధనస్సు రాశి
గురువు అనుగ్రహం ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు. కెరీర్ కు అభివృద్ధి బాటలు పరుస్తాడు. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చేలా చూస్తాడు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించేలా అనుగ్రహిస్తాడు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తిచేయడానికి కావల్సిన సహకారాన్ని అందించేలా గురువు చూస్తాడు. వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనింపచేస్తాడు. భౌతిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి తేడా తెలియజేస్తాడు. తాను చెప్పిన మాట వింటే తనంతటవాణ్ని చేస్తాడు. వినకపోతే కర్మకు విడిచిపెడతాడు. కాబట్టి బృహస్పతి దయవల్ల జీవితం అభివృద్ధి పథంలో పయనింపచేసే అవకాశం ధనుస్సు రాశివారికి వచ్చింది. ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నతస్థాయికి వెళతారు.

two zodiac signs will become millionaires due to jupiter transit in gemini

మిథున రాశి
జాతకంలో గురువు బలంగా ఉండటంవల్ల అదృష్టం కలిసివస్తుంది. కొత్తగా ఆస్తులు కలిసివస్తాయి. ఎప్పటినుంచో కలలు కంటున్న విదేశీయానానికి సంబంధించినవాటికి మార్గాన్ని సుగమం చేస్తాడు. సరికొత్త అవకాశాలను సృష్టిస్తాడు. వాటిని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఒకసారి వాటిని అందిపుచ్చుకున్నామా జీవితంలో తిరుగనేదే ఉండదు. కొత్త వ్యాపారం ప్రారంభించినవారికి బాగా కలిసివస్తుంది. లాభార్జన బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+