ఉగాది తర్వాత ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే
విలాసవంతమైన జీవితానికి, అందానికి, కళలకు, ప్రేమకు, సౌభాగ్యానికి, సంతోషానికి, ఆనందానికి ప్రతీక శుక్రుడు. రాక్షసుల గురువైన శుక్రుడు ఎవరి జాతకంలో శుభస్థానంలో ఉంటే వారికి తిరుగుండదు. సంపద వెల్లువలా వస్తుంది. జీవితకాలం వారంతా సంతోషంగా జీవించవచ్చు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది తర్వాత శుక్రుడు మీన రాశి నుంచి కుంభరాశిలోకి తిరోగమనం చేస్తాడు. దీనివల్ల రెండు రాశులవారికి సంపద పెరగడంతోపాటు శ్రేయస్సు, శాంతి కలిగి మంచి ఆరోగ్యంగా జీవిస్తారు. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.
కుంభ రాశి
దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అనురాగం వెల్లివిరుస్తుంది. మనస్పర్థలు లేకుండా అన్యోన్యంగా కలిసుంటారు. డబ్బును అనేక మార్గాల్లో సంపాదిస్తారు. వ్యాపారాలు చేసేవారికి లాభాలు రెట్టింపు స్థాయిలో వస్తాయి. వస్త్రాలను కొనుగోలు చేయడం, బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం చేస్తారు. అలాగే కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్థులకు వారి కార్యాలయంలో వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. డబ్బును పొదుపు చేయకపోతే భవిష్యత్తులో నష్టాలు తలెత్తే ప్రమాదం ఉందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు.

మీన రాశి
శుక్రుడి సంచారం వీరి జీవితాల్లో దీపావళి వెలుగులు తెస్తుంది. అదృష్టం బాగా కలిసిరావడంతో అనుకున్న పనులన్నీ అవుతాయి. వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా మీ మీటలకు ఎంతో విలువుంటుంది. అంతా అనుకూలంగా జరుగుతుంది. శుక్రుడు వీరి జాతకంలో మంచి స్థాయిలో సంచారం చేస్తున్నాడు. సమాజంలో హోదా పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఇంట్లో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా వెంటాడుతున్న సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. అత్యంత విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి విహార యాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications