సొంతరాశిలోకి శుక్రుడు... ఈ రాశులపై లక్ష్మీదేవి సిరుల వర్షం

వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. సంపదకు, శ్రేయస్సుకు, ఐశ్వర్యానికి, కీర్తికి ప్రతీక అయిన శుక్రుడు శుభస్థానంలో ఉన్న సమయంలో కఠినమైన సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. వచ్చే నెల 29వ తేదీన శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితం మొత్తం మారిపోనుంది. ఒకరకంగా వారికి అదృష్టం కలిసివస్తుందని చెప్పొచ్చు. ఏయే రాశులకు శుక్రుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించనున్నాడనే విషయాన్ని తెలుసుకుందాం.

కన్యారాశి
డబ్బుకు సంబంధించి కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదృష్టం సహకరించడంవల్ల అన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. అన్ని లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు చెప్పలేనంత మేలు కలుగుతుంది. పెండింగ్ పనులు ఈ సమయంలోనే పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులంతా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. వేతనాలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది.

two zodiac signs will get amazing financial benefits due to venus wll enter taurus

వృషభ రాశి
చేపట్టే ప్రతి పనిలో సానుకూల ఫలితమే వస్తుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో చాలా సులువుగా విజయం సాధించడంతోపాటు ఆర్థికంగా కలిసివస్తుంది. ఏ పని అనుకుంటే అది జరిగితీరుతుంది. జీవితంలో సంతోషంగా ఉంటారు. ఆర్థిక సంబంధాలన్నీ మెరుగుపడటంతోపాటు గతంలోకంటే ఇప్పుడు మంచి స్థితిలో ఉంటారు. శివాలయాల్లోని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతోపాటు శుక్రుడిని పూజించడంవల్ల పెళ్లికానివారికి వివాహం కుదురుతుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. జీవితం మొత్తం సానుకూలంగా సాగుతుంది. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు పూర్తవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+