గృహిణులకు వస్తు చిట్కాలు: ప్రతీ ఇల్లాలు తెలుసుకోవాల్సినవి..

గృహిణులు ముఖ్యముగా తెలుసుకొనవలసింది... తాము నివసించు గృహములో ఈశాన్యము లేకపోతే సంతానభాగ్యముండదు.

ప్రతి ఇంటిలో ఇల్లాలు తెలుసుకోవలసిన చిన్న సూచనలు కొన్ని ఉన్నాయి.

1. గృహిణులు ముఖ్యముగా తెలుసుకొనవలసింది... తాము నివసించు గృహములో ఈశాన్యము లేకపోతే సంతానభాగ్యముండదు లేదా ఆ దిక్కు యొక్క రూపముననుసరించి కలిగియును, చనిపోవుట జరుగును. కనుక ప్రతి గృహిణి తాము నివసించు గృహములో ఈశాన్యము విశాలముగా నుండునటు చూచుకొనవలెను.

2. ఆగ్నేయ, నైరుతి దిక్కులు పెరిగినా మరియు దిక్కులలో నూతులు, గోతులున్నను, ఆ గృహములోని వారు దీర్ఘరోగములకు గురి అగుదురు. వారికి తమ సంతానముపై విపరీత పరిణామములు కలుగును. కాబట్టి ఆగ్నేయ, నైరుతి దిక్కులు పెరుగకుండునటు నూతులు, గోతులు లేకుండునటు చూచుకొనవలెను.

Vaastu ideas for women

3. గృహావరణ యందు మరియు గృహ ఈశాన్యము, మరియు ప్రతి గదియొక్క యిూశాన్యమందు బరువులు ఉండకుండా ఖాళీగా యుండవలెను.

4. ప్రతిదినము ఇల్లూడ్చేటపుడు ఈశాన్యమూలకు ఊడ్చరాదు. అక్కడ చెత్తచెదారముండకూడదు.

5. ఈశాన్యమూలలందు బొమ్మరిండు, కోళ్ళగూళ్ళ పిడకల కుచ్చెనలు, దేవతార్చనకై పీఠములు నిర్మించరాదు. కట్టెల మోపులుంచరాదు.

6. ప్రతినిత్యము ఇలు తుడుచుటలో దక్షిణ, పశ్చిమముల నుండి ఉత్తరము, తూర్పులకు తుడుచుట అలవాటు చేసుకొనవలెను.

7. ఆవరణలోని నీరు ఉత్తరము, తూర్పు, ఈశాన్యములకు పారునటుగా చూచుకొనవలెను.

8. గృహావరణలో ఆగ్నేయ, నైరుతి, దక్షిణ, పశ్చిమములందెప్పడును నీళ్ళు వాడుచుండుట వలన స్త్రీలకు కుసుమ వ్యాధులు సంక్రమించి వాటితో ఎప్పడును బాధపడుతుంటారు. కావున పై దిశలలో ఎల్లప్పడు నీరు వాడుట జరుగకుండునటు చూచుకొనవలెను.

9. వాయువ్యమును మూసి (ప్లాటుయొక్క) యిలు కట్టిన యెడల అందునివసించు వారెల్లప్పడు కలహములలోనుందురు. కావున స్థలముయొక్క వాయువ్యము మూత లేకుండ చూచుకొనవలెను.

10. ఇంటికి ఆగ్నేయ మందున్న గదియందు, ఆగ్నేయ మూలనే పొయ్యిని తూర్పు గోడకు తగులకుండునటు వంట చేయువారి మొగము తూర్పునకుండు రీతిగ నేర్పాటు చేసుకొనవలెను.

11. పాత్రలు, సామానులు, బొమ్మలు మొదలైనవుంచుటకై గోడలకు వేయు మేకుల వలన స్త్రీలకనేక రకములైన చిక్కులు వచ్చును. కావున అవి లేకుండ చూసుకొనవలెను.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+